అతని ఆలోచనలు రాకెట్ కన్నా వేగంగా ఉంటాయి. సెకను దొరికినా చాలు... తుపానులా దూసుకుపోతాడు. పెను ఉప్పెనలా ముంచేస్తాడు. ప్రత్యర్థులు మరో ఎత్తు ఆలోచించేలోగానే ఆట ముగిస్తాడు. ఇలా దూకుడుగా సాగిపోయే ఆ యువకుడి లక్ష్యం ఏమిటో తెసుకోవాలంటే కొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దూకుడు'. మహేష్‌బాబు కథానాయకుడు. సమంత నాయిక. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ముఖ్య తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ జన్మదినం సందర్భంగా ఆగస్టు తొలి వారంలో పాటల్ని విడుదల చేస్తారు.
0 comments:
Post a Comment