మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పాటలు విడుదలవుతాయి. ఇప్పటికే మార్కెట్లో దూకుడు గీతాలు పేరుతో సీడీలు వచ్చాయి. అయితే అవి తమ చిత్రానికి సంబంధించినవి కావని నిర్మాతలు గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ ''వినోదాన్నీ, యాక్షన్ అంశాల్నీ పండించడంలో మహేష్‌బాబుది ప్రత్యేకమైన శైలి. వాటిని సమపాళ్లలో మేళవించి చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు. ఓ ధీరుడి దూకుడు ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. తమన్ వినసొంపైన స్వరాల్ని సమకూర్చారు. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''న్నారు.
0 comments:
Post a Comment