మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా

 ఇది మహేష్‌బాబు డైలాగ్. ‘దూకుడు’ సినిమా కోసం దూకుడుగా చెప్పిన డైలాగ్. ‘‘మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా’’ అని ఒకే ఒక్క డైలాగ్‌తో మంగళవారం విడుదలైన ‘దూకుడు’ ట్రైలర్ ఇంటర్‌నెట్‌లో విపరీతంగా సందడి చేస్తోంది. కృష్ణ బర్త్‌డే సందర్భంగా అభిమానుల కోసం ఈ ట్రైలర్‌తో పాటు మహేష్ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.

‘‘ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో... వాడే పండుగాడు’’ అంటూ ‘పోకిరి’లో మహేష్‌బాబు చేసిన సందడి అభిమానుల్ని ఇంకా మురిపిస్తూనే ఉంది. ‘పోకిరి’ తరహా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న మహేష్... పక్కాకమర్షియల్ మాస్‌యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘దూకుడు’ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ల రూపకల్పనలో సిద్ధహస్తుడనిపించుకున్న శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు.

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్, అనిల్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమంత ఇందులో కథానాయిక. ‘ఖలేజా’ తర్వాత ఇకపై విరామం లేకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు మహేష్. ఆ నిర్ణయంలో భాగంగా ‘దూకుడు’ చిత్రం కోసం శరవేగంగా పనిచేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ మహేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ‘దూకుడు’ రూపొందుతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మహేష్ చిత్రానికి తొలిసారిగా ఎస్.ఎస్.థమన్ స్వరాలందిస్తున్నారు.

రాజధానిలో 'దూకుడు'


హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీనువైట్ల దర్శకుడు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే నెల 20 వరకూ నిరవధికంగా సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆయన హవభావాలు, మాట్లాడే విధానం అభిమానులకు తప్పకుండా నచ్చుతాయి. శ్రీనువైట్ల మహేష్‌ని కొత్తకోణంలో చూపిస్తున్నారు. సమంత పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. వచ్చే నెలాఖరునాటికి చిత్రీకరణ ముగుస్తుంది. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'దూకుడు' లోగోను, ప్రకటన చిత్రాల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు'' చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్‌.

'ది బిజినెస్‌మేన్‌' జులై చివరి వారంలో

హేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ - వీరిద్దరి పేర్లు చెప్పగానే 'పోకిరి' చిత్రమే గుర్తుకొస్తుంది. త్వరలో వీరిద్దరి నుంచీ 'ది బిజినెస్‌మేన్‌' చిత్రం రాబోతోంది. కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం మహేష్‌బాబు 'దూకుడు' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. జులై వరకూ 'దూకుడు' పనుల్లోనే ఉంటారు. ఆ తరవాత 'ది బిజినెస్‌మేన్‌'కి శ్రీకారం చుడతారు. ఆ నెల చివరి వారంలో ముంబైలో చిత్రీకరణ మొదలుపెడతారు. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పతాకంపై వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''మాఫియా నేపథ్యంలో నడిచే కథ ఇది. తుపాకులకు ఒప్పందాలతో పనిలేదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన మనుషుల కథ ఇది. అందుకే 'గన్స్‌ డోన్ట్‌ నీడ్‌ ఎగ్రిమెంట్‌' అనే శీర్షికపెట్టాం. మహేష్‌ని కొత్త కోణంలో చూపించే చిత్రం అవుతుంద''ని పూరి జగన్నాథ్‌ చెబుతున్నారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు


హేష్‌బాబు 'దూకుడు'తో ఈ వానాకాలంలో సందడి చేయబోతున్నారు. ఈ సినిమా తరవాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారు?.. సుకుమార్‌ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. '100% లవ్‌'తో ప్రేక్షకుల్ని మెప్పించారు సుకుమార్‌. ఆయన వినిపించిన కథాంశం మహేష్‌ని ఆకట్టుకొంది. ప్రస్తుతం దీనిపై కథా చర్చలు సాగుతున్నాయి. దూకుడు తరవాత ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ప్రస్తుతం మహేష్‌బాబు 'దూకుడు' చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

బిజినెస్‌ మేన్‌లో కాజల్‌

యువ కథానాయకులందరి సరసన నటిస్తున్న కాజల్‌ తొలిసారి మహేష్‌బాబుతో ఆడిపాడబోతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటించే చిత్రం 'ది బిజినెస్‌మేన్‌'. 'గన్స్‌ డోన్ట్‌ నీడ్‌ అగ్రిమెంట్స్‌' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నాయికగా కాజల్‌ని ఎంపిక చేసుకున్నారు. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై వెంకట్‌ నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ''పోకిరి తరవాత మహేష్‌తో చేయాలని పలుమార్లు అనుకొన్నాను. మా కలయికకి తగిన కథ కోసం చూశా. 'ది బిజినెస్‌మేన్‌' అనేది పూర్తిగా మహేష్‌ శైలికి సరిపోతుంది. ఆయనలోని నటుణ్ని కొత్త కోణంలో ఆవిష్కరించేలా ఉంటుంది. ఇప్పటికే కథ, కథనాలు సిద్ధమయ్యాయ''న్నారు. ''పూరి చెప్పిన కథ బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుంది. కథానాయకుడి పాత్ర శక్తిమంతంగా ఉంద''న్నారు నిర్మాత. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం మహేష్‌ 'దూకుడు' చిత్రీకరణలో ఉన్నారు. అలాగే పూరి 'బుడ్డా' చిత్ర పనుల్లో ఉన్నారు. వీరిద్దరి తరవాతి చిత్రం ది బిజినెస్‌మేనే!

పాటల్లో 'దూకుడు'


 ఈసురోమంటూ కాలం వెళ్లదీస్తే... మన కళ్లకు లోకం కూడా స్తబ్దుగా కనిపిస్తుంది. చేతల్లో, మాటల్లో హుషారు ఉంటేనే... జీవితంలో కూడా మజా ఉంటుంది. అలా అన్నింట్లోనూ దూకుడు మీదుండే యువకుడిని మా సినిమాలో చూడొచ్చు అంటున్నారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దూకుడు'. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్నారు. సమంత కథానాయిక. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఓ పాటతోపాటు పోరాట దృశ్యాలు తెరకెక్కిస్తారు.''ఆవేశంలోనే కాదు, ఆలోచనల్లోనూ దూకుడుగా ఉండే యువకుడిగా మహేష్‌బాబు కనిపిస్తారు. 'నీ దూకుడికి సాటెవ్వరు..' అని లోకం కీర్తించేలా ప్రవర్తిస్తాడు. అతని జీవితంలో ఎదురయ్యే సంఘటనల సమాహారం ఈ చిత్రం. మహేష్‌బాబుని కొత్త కోణంలో చూపిస్తున్నాం. యాక్షన్‌ అంశాలతో పాటు, వినోదం కూడా సమపాళ్లలో మేళవించాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్‌.

మహేష్‌బాబుతో కాజల్ !

వరుస హిట్‌లతో పంజాబీ క్యూట్‌గాళ్ కాజల్ టాలీవుడ్‌లో అగ్రనాయికగా భాసిల్లుతున్నారు. ‘మగధీర’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ తార నటించిన కొన్ని చిత్రాలు అపజయాన్ని చవిచూడటంతో కాస్త నెమ్మదించిన ఆమె కెరీర్ మళ్ళీ ఇప్పుడు ఊపందుకుంది. ప్రస్తుతం నాగచైతన్యతో ఓ చిత్రంతో పాటు రవితేజ ‘వీర’ చిత్రంలో నటిస్తున్న ఈ తార త్వరలోనే మహేష్‌బాబుతో ఓ చిత్రంలో జతకట్టనున్నారని తెలిసింది.

తెలుగు సినిమా చరిత్రలో ‘పోకిరి’ సినిమా ద్వారా రికార్డు హిట్ ఇచ్చిన జంట- మహేష్, పూరిల కాంబినేషన్‌లో రూపొందనున్న ‘ది బిజినెస్ మేన్’ చిత్రంలో కాజల్ నాయికగా ఎంపికయ్యారని సమాచారమ్.


ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్‌మీదకు వెళ్ళనుంది.. ‘గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్సు’ అనే ఉపశీర్షికతో తెరకెక్కనున్న ఈ సినిమా... మాఫియా నేపథ్యంలో కొనసాగుతుంది. తొలిసారిగా మహేష్‌తో నటించే అవకాశం రావటం పట్ల ఎంతో హ్యాపీగా వున్నారట కాజల్.

రామోజీ ఫిల్మ్‌సిటీలో దూకుడు

హేష్‌బాబు తన దూకుడు ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూపించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగింది. అక్కడి సెంట్రల్‌ జైలు సెట్లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. త్వరలో విదేశాల్లో మరో పాటని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆయన హావభావాలు, మాట్లాడే విధానం అభిమానులకు తప్పకుండా నచ్చుతాయి. శ్రీను వైట్ల మహేష్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సమంత పాత్ర కూడా కీలకమే. చిత్రీకరణ తుది దశకు చేరుకొంద''ని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates