మహేష్‌బాబు తన దూకుడు ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూపించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగింది. అక్కడి సెంట్రల్ జైలు సెట్లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. త్వరలో విదేశాల్లో మరో పాటని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆయన హావభావాలు, మాట్లాడే విధానం అభిమానులకు తప్పకుండా నచ్చుతాయి. శ్రీను వైట్ల మహేష్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సమంత పాత్ర కూడా కీలకమే. చిత్రీకరణ తుది దశకు చేరుకొంద''ని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు.
0 comments:
Post a Comment