ఈసురోమంటూ కాలం వెళ్లదీస్తే... మన కళ్లకు లోకం కూడా స్తబ్దుగా కనిపిస్తుంది. చేతల్లో, మాటల్లో హుషారు ఉంటేనే... జీవితంలో కూడా మజా ఉంటుంది. అలా అన్నింట్లోనూ దూకుడు మీదుండే యువకుడిని మా సినిమాలో చూడొచ్చు అంటున్నారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దూకుడు'. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్నారు. సమంత కథానాయిక. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఓ పాటతోపాటు పోరాట దృశ్యాలు తెరకెక్కిస్తారు.''ఆవేశంలోనే కాదు, ఆలోచనల్లోనూ దూకుడుగా ఉండే యువకుడిగా మహేష్‌బాబు కనిపిస్తారు. 'నీ దూకుడికి సాటెవ్వరు..' అని లోకం కీర్తించేలా ప్రవర్తిస్తాడు. అతని జీవితంలో ఎదురయ్యే సంఘటనల సమాహారం ఈ చిత్రం. మహేష్‌బాబుని కొత్త కోణంలో చూపిస్తున్నాం. యాక్షన్ అంశాలతో పాటు, వినోదం కూడా సమపాళ్లలో మేళవించాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్.
0 comments:
Post a Comment