యువ కథానాయకులందరి సరసన నటిస్తున్న కాజల్ తొలిసారి మహేష్‌బాబుతో ఆడిపాడబోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించే చిత్రం 'ది బిజినెస్‌మేన్'. 'గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్స్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నాయికగా కాజల్‌ని ఎంపిక చేసుకున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ''పోకిరి తరవాత మహేష్‌తో చేయాలని పలుమార్లు అనుకొన్నాను. మా కలయికకి తగిన కథ కోసం చూశా. 'ది బిజినెస్‌మేన్' అనేది పూర్తిగా మహేష్ శైలికి సరిపోతుంది. ఆయనలోని నటుణ్ని కొత్త కోణంలో ఆవిష్కరించేలా ఉంటుంది. ఇప్పటికే కథ, కథనాలు సిద్ధమయ్యాయ''న్నారు. ''పూరి చెప్పిన కథ బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుంది. కథానాయకుడి పాత్ర శక్తిమంతంగా ఉంద''న్నారు నిర్మాత. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం మహేష్ 'దూకుడు' చిత్రీకరణలో ఉన్నారు. అలాగే పూరి 'బుడ్డా' చిత్ర పనుల్లో ఉన్నారు. వీరిద్దరి తరవాతి చిత్రం ది బిజినెస్‌మేనే!
0 comments:
Post a Comment