మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీనువైట్ల దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే నెల 20 వరకూ నిరవధికంగా సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆయన హవభావాలు, మాట్లాడే విధానం అభిమానులకు తప్పకుండా నచ్చుతాయి. శ్రీనువైట్ల మహేష్‌ని కొత్తకోణంలో చూపిస్తున్నారు. సమంత పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. వచ్చే నెలాఖరునాటికి చిత్రీకరణ ముగుస్తుంది. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'దూకుడు' లోగోను, ప్రకటన చిత్రాల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు'' చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్.
0 comments:
Post a Comment