వరుస హిట్‌లతో పంజాబీ క్యూట్‌గాళ్ కాజల్ టాలీవుడ్‌లో అగ్రనాయికగా భాసిల్లుతున్నారు. ‘మగధీర’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ తార నటించిన కొన్ని చిత్రాలు అపజయాన్ని చవిచూడటంతో కాస్త నెమ్మదించిన ఆమె కెరీర్ మళ్ళీ ఇప్పుడు ఊపందుకుంది. ప్రస్తుతం నాగచైతన్యతో ఓ చిత్రంతో పాటు రవితేజ ‘వీర’ చిత్రంలో నటిస్తున్న ఈ తార త్వరలోనే మహేష్‌బాబుతో ఓ చిత్రంలో జతకట్టనున్నారని తెలిసింది.
తెలుగు సినిమా చరిత్రలో ‘పోకిరి’ సినిమా ద్వారా రికార్డు హిట్ ఇచ్చిన జంట- మహేష్, పూరిల కాంబినేషన్‌లో రూపొందనున్న ‘ది బిజినెస్ మేన్’ చిత్రంలో కాజల్ నాయికగా ఎంపికయ్యారని సమాచారమ్.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్‌మీదకు వెళ్ళనుంది.. ‘గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్సు’ అనే ఉపశీర్షికతో తెరకెక్కనున్న ఈ సినిమా... మాఫియా నేపథ్యంలో కొనసాగుతుంది. తొలిసారిగా మహేష్‌తో నటించే అవకాశం రావటం పట్ల ఎంతో హ్యాపీగా వున్నారట కాజల్.
0 comments:
Post a Comment