మహేష్‌బాబు 'దూకుడు'తో ఈ వానాకాలంలో సందడి చేయబోతున్నారు. ఈ సినిమా తరవాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారు?.. సుకుమార్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. '100% లవ్'తో ప్రేక్షకుల్ని మెప్పించారు సుకుమార్. ఆయన వినిపించిన కథాంశం మహేష్‌ని ఆకట్టుకొంది. ప్రస్తుతం దీనిపై కథా చర్చలు సాగుతున్నాయి. దూకుడు తరవాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ప్రస్తుతం మహేష్‌బాబు 'దూకుడు' చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
0 comments:
Post a Comment