ఇది మహేష్‌బాబు డైలాగ్. ‘దూకుడు’ సినిమా కోసం దూకుడుగా చెప్పిన డైలాగ్. ‘‘మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా’’ అని ఒకే ఒక్క డైలాగ్‌తో మంగళవారం విడుదలైన ‘దూకుడు’ ట్రైలర్ ఇంటర్‌నెట్‌లో విపరీతంగా సందడి చేస్తోంది. కృష్ణ బర్త్‌డే సందర్భంగా అభిమానుల కోసం ఈ ట్రైలర్‌తో పాటు మహేష్ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.
‘‘ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో... వాడే పండుగాడు’’ అంటూ ‘పోకిరి’లో మహేష్‌బాబు చేసిన సందడి అభిమానుల్ని ఇంకా మురిపిస్తూనే ఉంది. ‘పోకిరి’ తరహా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న మహేష్... పక్కాకమర్షియల్ మాస్‌యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘దూకుడు’ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ల రూపకల్పనలో సిద్ధహస్తుడనిపించుకున్న శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు.
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్, అనిల్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమంత ఇందులో కథానాయిక. ‘ఖలేజా’ తర్వాత ఇకపై విరామం లేకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు మహేష్. ఆ నిర్ణయంలో భాగంగా ‘దూకుడు’ చిత్రం కోసం శరవేగంగా పనిచేస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ మహేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ‘దూకుడు’ రూపొందుతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మహేష్ చిత్రానికి తొలిసారిగా ఎస్.ఎస్.థమన్ స్వరాలందిస్తున్నారు.
0 comments:
Post a Comment