సినీ పరిక్షిశమలో కథానాయకులు నటిస్తూనే కొత్త శాఖల్లోనూ తమ ప్రతిభని
చూపించడానికి ప్రయత్నించిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈ తరం క్రేజీ
హీరోలైన పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్‌లు తెరపై జిమ్మిక్కులు చేస్తూనే
సింగర్లుగానూ తమ గాన కౌశలాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. త్వరలోనే
మహేష్ వీరి జాబితాలో చేరనున్నాడు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్
తెరకెక్కిస్తున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం
దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి మహేష్ ఓ థీమ్‌సాంగ్‌ను ఆలపిస్తున్నాడట.
ఇప్పటి వరకు ఏ చిత్రం కోసం గొంతు సవరించని మహేష్ తొలిసారి ‘బిజినెస్‌మెన్’
చిత్రం కోసం గాయకుడిగా మారుతుండటం విశేషం.మహేష్ గీతాలాపన చిత్రానికి
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం
షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రం జనవరి 11న విడుదలకు
సిద్దమవుతోంది. ఈ చిత్రం ఆడియోని డిసెంబర్‌లో మూడు భాషల్లో ఒకేసారి విడుదల
చేయనున్నారని సమాచారం.