‘ఇలా రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చేయొద్దు...ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కు కొట్టేస్తాను’ ఇది మహేష్‌బాబు ‘బిజినెస్‌మేన్’ ఫస్ట్ లుక్ ట్రైలర్స్‌లో ఓ డైలాగ్...ఈ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన తొలి స్టిల్‌ను విడుదల చేశారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహ నిర్మాత వి.సురేష్‌డ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ముంబాయ్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 8 లోగా చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో ఆడియోను విడుదల చేస్తాం.
జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమాని విడుదల చేస్తాం’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మహేష్‌బాబు హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరిస్తున్నాం. మహేష్‌బాబు సూపర్ పర్‌ఫ్మాన్స్ కనబరుస్తున్నాడు. ‘పోకిరి’ తర్వాత మహేష్‌తో చేస్తోన్న ఈ చిత్రం కొత్త చరివూతను సృష్టిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, భరత్‌డ్డి, రాజా తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోక్షిగఫీ: శ్యామ్ కె నాయుడు, ఫైట్స్: విజయ్, నిర్మాత: వెంకట్, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.
0 comments:
Post a Comment