పోకిరి’ తర్వాత ‘దూకుడు’తో మళ్లీ తన సత్తాను చాటుకున్న అందాల నటుడు
మహేష్‌బాబు ఇప్పుడు ఆనందసాగరంలో మునిగివున్నారు. బాక్సాఫీసు రికార్డులను
తనదైన శైలిలో తిరగరాయడమే కాకుండా, అమెరికా వంటి విదేశాల్లో కూడా అత్యధిక
వసూళ్లతో తెలుగు సినిమా ‘స్టామినా’ని ‘దూకుడు’తో తెలియజెప్పారు మహేష్.
ఇలాంటి సక్సెస్ కోసమే సూపర్‌స్టార్ అభిమానులు ఇంతకాలం ఎదురుచూశారు. తెలుగు
చిత్రపరిశ్రమ కూడా ఇటువంటి విజయాలను ఆశిస్తూ వచ్చింది.
ఈ సినిమాకు లభించిన విజయాన్ని అంచనా వేసే పనిలో సినీ పండితులున్నారు. 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ ‘మగధీర’ అత్యధిక సొమ్ము వసూలు చేసిన చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సాధించింది. మరి ‘దూకుడు’ ఫైనల్‌గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుస్తుంది.
ఈ చిత్రానికి ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాతలు రామ్, గోపీచంద్, అనీల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నెల 12న విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ‘అర్ధశతదినోత్సవ’ వేడుకను ఘనంగా నిర్వహించలిచినట్లు తెలిపారు. ‘ఒక్కడు’ తర్వాత మహేష్‌బాబు పబ్లిక్ ఫంక్షన్‌లో పాల్గొనడం ఇదే అని చెప్పుకోవచ్చు. కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు ఈ ఉత్సవంలో భారీ ఎత్తున పాల్గొంటున్నట్లు తెలిసింది.
0 comments:
Post a Comment