‘దూకుడు’ చిత్రంతో యమదూకుడు మీదున్న కథానాయకుడు మహేష్‌బాబు ప్రస్తుతం పూరి
జగన్నాథ్ దర్శకత్వంలో ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్న విషయం
తెలిసిందే. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్
ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం
రికార్డు స్థాయిలో తక్కువరోజుల్లో పూర్తి కాబోతోంది. ఇటీవల విడుదలైన
‘దూకుడు’ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘బిజినెస్‌మెన్’
చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు
చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 11న ఫస్ట్‌లుక్ విడుదల చేసి చిత్రాన్ని
సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాజల్
అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఇందుమతి’ ఫేమ్ శ్వేతా భరద్వాజ్
ప్రత్యేక గీతంలో నర్తించనుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘
దీపావళి కానుకగా విడుదల కానున్న ‘బిజినెస్‌మెన్’ ఇదే రోజు తెలుగుతో పాటు
తమిళ, మళయాల భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని
తెలిపారు.
0 comments:
Post a Comment