మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్ మేన్'. కాజల్ కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ నిర్మాత. చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్నారు. దినేష్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్-పూరి కలయికలో 'పోకిరి' తర్వాత వస్తున్న చిత్రమిది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ నటన, హావభావాలు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. ముంబయిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 'ఇలా రౌండప్ చేసి నన్ను కనఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అనే సంభాషణతో ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది.
ఈ నెలాఖరు వరకు బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తాం. వచ్చే నెల 1 నుంచి హైదరాబాద్‌లో మహేష్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ తదితరులు పాల్గొనే సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. డిసెంబరు 23న పాటల్ని విడుదల చేస్తామ''ని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె నాయుడు, సంగీతం: తమన్.
0 comments:
Post a Comment