దటీజ్ మహాలక్ష్మీ... అంటూ '100% లవ్' సినిమాలో తమన్నా పాత్రని తీర్చిదిద్దారు సుకుమార్. అందం, తెలివితేటలు కలబోసిన మరదలి పిల్లగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకొంది. మరోసారి ఆ భామనే కథానాయికగా ఎంచుకొన్నట్లు తెలిసింది. మహేష్‌బాబు - సుకుమార్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కథానాయిక పాత్ర తమన్నాకి దక్కింది.
ప్రస్తుతం మహేష్‌బాబు 'బిజినెస్‌మేన్' చిత్రీకరణలో ఉన్నారు. ఇది పూర్తికాగానే సుకుమార్ చిత్రం సెట్స్ మీదకు వెళుతుంది. వచ్చే యేడాది ప్రథమార్థంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
0 comments:
Post a Comment