'దూకుడు' ఎలా ఉంటుందో ఈ మధ్యే చూపించారు మహేష్‌బాబు. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే 'బిజినెస్‌మేన్'గా మారిపోయారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమది. కాజల్ కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ నిర్మాత.
ప్రస్తుతం ముంబైలో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 27 నుంచి గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''తుపాకీలకు ఒప్పందాలతో పనిలేదు. మనుషుల కన్నా.. బుల్లెట్లే ఎక్కువగా మాట్లాడతాయి. ఆ తరహా నేపథ్యంలో జరిగే కథ ఇది. యాక్షన్ అంశాలతోపాటు వినోదం కూడా మేళవించాం. మహేష్‌తో సినిమా తీస్తున్నానంటే అందరికీ 'పోకిరి' సినిమానే గుర్తొస్తుంది. ఇకపై మహేష్‌తో మరో సినిమా చేస్తే 'బిజినెస్‌మేన్' గుర్తుకు వస్తుంద''ని చెప్పారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
0 comments:
Post a Comment