ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం
‘ఖైదీ’. ఈ చిత్రమే చిరంజీవిను స్టార్ హీరోని చేసింది. కోదండరామిడ్డి
దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి అందరికి
తెలిసిందే. ఇక తాజాగా ఈ మైల్‌స్టోన్ చిత్రాన్ని యువ కథానాయకుడు మహేష్‌బాబు
హీరోగా పూరి జగన్నాథ్ రీమేక్ చేయనున్నాడని తెలిసింది.
ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరిచాడు. ‘ మహేష్, పూరీ కాంబినేషన్‌లో చిరంజీవి ‘ఖైదీ’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారనే గొప్ప న్యూస్‌ను నేను విన్నాను. జగన్ చెప్పిన మహేష్ పాత్రతో కంపేర్ చేస్తే కోదండరామిడ్డి డిజైన్ చేసిన చిరంజీవి పాత్ర నథింగ్’ అంటూ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరచడం విశేషం. ఇక ఈ వార్త తెలుగు సినీ పరిక్షిశమలో తప్పకుండా హాట్‌టాపిక్‌గా మారుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
0 comments:
Post a Comment