'కొడితే ఒక్కొక్కడికీ బల్బులు పగిలిపోవాలి...' - అంటూ 'దూకుడు'లో తనదైన శైలిలో యాక్షన్‌లో వినోదం మేళవించారు మహేష్‌బాబు. ఇప్పుడు అచ్చమైన వ్యాపారవేత్త ఎలా ఉంటాడో చూపించబోతున్నారు. మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్'. కాజల్ కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ నిర్మాత.
ప్రస్తుతం గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ''మహేష్- పూరి జగన్నాథ్ కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు తెలుసు. వాటికి ఏ మాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉంటుంది. మహేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకొంటుంది. త్వరలో స్పెయిన్‌లో మూడు పాటలు చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
0 comments:
Post a Comment