‘దూకుడు’ ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందని ముందుగా ఊహించారా?
‘దూకుడు’ షూటింగ్ మొదటి రోజు నుంచే ఓ సూపర్‌హిట్ సినిమా చేస్తున్నాననే ఫీల్ కలిగింది. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని అందరికీ నమ్మకముండేది. కానీ ఈ స్థాయిలో సక్సెస్‌ను ఎవ్వరూ ఊహించలేదు. నేను ఈ సినిమా ఆడియో వేడుకలో చెప్పినట్లుగా నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోనుంది. ట్రేడ్ వర్గాలు కూడా ఈ చిత్రానికి వంద కోట్లు వసూళ్లు చేయగల సత్తా వుందని విశ్లేషిస్తున్నారు. సినిమా విడుదలైన దగ్గరినుంచి ‘ది బిజినెస్‌మేన్’ షూటింగ్‌లో వుండటం వల్ల సినిమా సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను.
ఇందులో నాలుగు వేరియేషన్స్ వున్న పాత్రల్ని చేశారు. షూటింగ్ సమయంలో ఎలా ఫీలయ్యారు?
నా కెరీర్‌లో ఇప్పటి వరకూ ఇన్ని షేడ్స్ వున్న పాత్రను చేయలేదు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రతీకార నేపథ్యమున్న కథాంశానికి వినోదాన్ని మేళవించి శ్రీనువైట్ల అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందులో ఏ పాత్ర కష్టమనిపించలేదు. కొంచెం సర్దుబాటు కావడానికి రెండు మూడు రోజులు పట్టిందంతే!. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో శ్రీనువైట్ల చాలా క్లారిటీతో వున్నాడు. సో..సినిమా మొత్తం ఆయన చెప్పినట్లు ఫాలో అయిపోయాను. నిజం చెప్పాలంటే షూటింగ్ ఆద్యంతం చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్ వున్న పాత్రలు చేశాను కాబట్టి మున్ముందు ఎలాంటి పాత్రనైనా పెద్దగా కష్టపడకుండా చేయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చింది.
ముఖ్యంగా ఎమ్.ఎల్.ఎ పాత్రలో కొత్తగా కన్పించారంటున్నారు?
స్క్రిప్ట్ విన్నప్పుడే ఈ పాత్ర సినిమాకి హైలైట్ అవుతుందని ఊహించాను. ఎందుకంటే గతంలో నేనెప్పుడు అలాంటి పాత్ర చేయలేదు. అందులో నా ఆహార్యం, మేనరిజమ్స్ అన్ని ప్రత్యేకంగా ఫక్తు రాజకీయ నాయకుడిలా వున్నాయంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘దూకుడు’లో నాది బెస్ట్ లుక్ అంటున్నారందరూ.
ఈ సినిమా సక్సెస్‌పై నాన్నగారి స్పందన ఎలా వుంది?
సినిమా విడుదలైన రోజు నేను, శ్రీనువైట్ల కారు ప్రయాణంలో వున్నప్పుడు నాన్నగారు ఫోన్ చేశారు. సినిమా 80 కోట్లు వసూళ్లు చేస్తుందని ధీమాగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ‘దూకుడు’ భారీ వసూళ్లు చేస్తోంది. ఆయన ఫోన్ చేసి అభినందించడమే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను.
‘దూకుడు’ చిత్రాన్ని మీ కెరీర్‌లో ఏ విధంగా ప్రత్యేకమైనదిగా భావిస్తారు?
‘పోకిరి’ తర్వాత నేను ఏ సినిమా చేసినా అందరూ దానితో పోల్చేవారు. ‘దూకుడు’ ఆ ఇమేజ్ నుంచి నన్ను బయట పడేసింది. అంతేకాదు రికార్డుల పరంగా కూడా ‘దూకుడు’ పోకిరిని అధిగమించింది.
భవిష్యత్తులో ప్రయోగాలకు ఆస్కారమున్న సబ్జెక్ట్‌లు చేస్తారా?
చేయను. కమర్షియల్ వాల్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ వున్న సినిమాలే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఉద్దేశ్యం లేదు.
ఈ సినిమా గురించి ఇండస్ట్రీ స్పందన ఎలా వుంది?
పూరి జగన్నాథ్ ఫోన్ చేసి నీ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశానని ప్రశంసించారు. రాజమౌళి కూడా సూపర్‌హిట్ మూవీ చేశావన్నారు.
‘ది బిజినెస్‌మేన్’ ఎంతవరకు వచ్చింది?
ప్రస్తుతం ముంబయ్‌లో షూటింగ్ జరుగుతోంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో తయారువుతున్న సై్టలిష్ మూవీ అది. దాదాపు యాభైశాతం పూర్తయింది. జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
ఈ సినిమాకి ఓవర్సీస్‌లో వస్తోన్న స్పందన పట్ల ఎలా ఫీలవుతున్నారు?
‘తీ ఇడియట్స్’ తర్వాత ఓవర్సీస్‌లో ఆ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న చిత్రమిదని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. అమెరికాలో ప్రముఖ పత్రిక లాస్ ఏంజిల్స్ టైమ్స్ ‘దూకుడు’ చిత్రంపై ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. ఇంతవరకూ ఏ భారతీయ సినిమా గురించి ఆ పత్రిక రాయలేదు. నిజంగా ఇది తెలుగువారందరూ గర్వించాల్సివ విషయం. ఓవర్సీస్‌లో ఒక్క వీకెండ్‌లోనే రెండు మిలియన్‌లు వసూళ్లు చేసింది. నైజాం కలెక్షన్లకు సమానంగా విదేశాల్లో వసూళ్లు చేసింది.
వెంక చేస్తోన్న ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఎలా వుంటుంది?
ఆ సినిమాలో పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. వెంక నాకు ఎప్పటినుంచే ఆత్మీయ అనుబంధం వుంది. ఈ చిత్రంలో ఇద్దరం అన్నాదమ్ముల్లుగా నటిస్తున్నాం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చి ఈ సినిమాలో నటిస్తున్నాను.
మీ తదుపరి చిత్రాలు?
‘ది బిజినెస్‌మేన్’ జనవరిలో విడుదలవుతుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ త్వరలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించే మరో చిత్రంలో నటించాల్సివుంది.
0 comments:
Post a Comment