మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్'. కాజల్ నాయిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అందులో కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''మహేష్‌బాబు శైలికి తగ్గ కథాంశమిది. వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగుతుంది. 'పోకిరి' బృందం నుంచి వస్తున్న చిత్రమిది. ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను అందుకొనేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. మహేష్ పాత్ర, ఆయన పలికే హావభావాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ''న్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదికొస్తుంది. ప్రకాష్‌రాజ్, సాయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: తమన్.
0 comments:
Post a Comment