మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. 'దూకుడు' పాటల్ని ఆగస్టు 18న విడుదల చేస్తారు. ఈ విషయాన్ని మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో తెలిపారు. ''దూకుడు పాటలు బాగా వచ్చాయి. తమన్ మంచి సంగీతాన్ని అందించారు. 18న పాటలు విడుదల చేస్తాం. మీలాగే నేను కూడా ఆరోజు కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని రాసుకొన్నారు. ఇటీవల 'దూకుడు' ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. దేనికీ తలవంచని ఓ యువకుని కథ ఇది. అతని లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా అందుకొన్నాడు? అనే విషయాల్ని ఆసక్తిగా చూపిస్తున్నాం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
0 comments:
Post a Comment