మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. వచ్చేనెల ప్రథమార్ధంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ''తమన్ హుషారైన బాణీలను అందించారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటల్లో ఉన్న దూకుడు కథ, కథనాల్లోనూ కనిపిస్తుంది. మహేష్‌బాబు తరహా యాక్షన్ ఘట్టాలు, శ్రీను వైట్ల శైలి వినోదం కలగలిపిన చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్, సాయాజీ షిండే, నాజర్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, మాస్టర్ భరత్, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, రచన: గోపి మోహన్, కోన వెంకట్, సమర్పణ: జి.రమేష్‌బాబు.
0 comments:
Post a Comment