''ప్రేక్షకుల అంచనాలు అందుకొనేలా ఉంటుంది మా 'దూకుడు' చిత్రం. ఆ సినిమా విడుదలయ్యే రోజు కోసం అందరిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. సెప్టెంబరు 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. దర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''మహేష్‌ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. అందులో ఆయన పలికిన సంభాషణలు అందరికీ నచ్చుతాయి. 'కళ్లున్నోడు ముందు చూస్తాడు... దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు', 'భయానికి మీనింగే తెలియని బ్లడ్‌రా నాది...' లాంటి పదునైన మాటలున్నాయ''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, సాయాజీ షిండే, నాజర్, సంజయ్ స్వరూప్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, మాస్టర్ భరత్, చంద్రమోహన్ తదితరులు నటించారు. సమర్పణ: జి.రమేష్‌బాబు, సంగీతం: తమన్.
0 comments:
Post a Comment