మహేష్‌బాబుని 'పోకిరి'గా మార్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. హీరోయిజానికి కొత్త అర్థం చెప్పిన చిత్రమది. మహేష్-పూరి కలయికలోమరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే... 'ది బిజినెస్ మేన్'. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభమైంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''జగన్ నాకు ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరి అంచనాలను అందుకొనేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉంద''న్నారు. ''పోకిరి తరవాత మళ్లీ మహేష్‌తో చేయడం ఆనందంగా ఉంది. నా సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రీకరణ బాగుంటుందని అందరూ చెబుతారు. నాకు నచ్చిన హీరో 'ది బిజినెస్ మేన్'లో కనిపిస్తాడ''ని చెప్పారు. ''మహేష్‌ని ఎలా చూడాలని అభిమానులు ఆశిస్తారో... అలానే తీర్చిదిద్దుతున్న చిత్రమిది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, కళ: చిన్నా, కూర్పు: ఎన్.ఆర్.శేఖర్, సంగీతం: తమన్.
0 comments:
Post a Comment