‘ఇటీవల విడుదలైన ‘దూకుడు’ ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. థమన్ అందించిన సంగీతం వైవిధ్యమైన బాణీలతో ఆకట్టుకుంటోంది. మహేష్‌బాబు చిత్రాల్లోనే ది బెస్ట్ ఆడియో అని అందరూ అంటున్నారు. కళ్లున్నోడు ముందు చూస్తాడు. దిమాక్ వున్నోడు దునియాను చూస్తాడు...లాంటి డైలాగ్స్ ఎన్నో ‘దూకుడు’ చిత్రంలో మహేష్‌బాబు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి’ అన్నారు చిత్ర నిర్మాతలు గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ‘రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే వారిని అన్ని విధాలా సంతృప్తిపరిచే విధంగా ఈ చిత్రం వుంటుంది. కావాల్సినంత వినోదంతో పాటు రోమాంచితమైన యాక్షన్ వుంటుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి.
శ్రీనువైట్ల పంచ్‌డైలాగ్‌లకు మహేష్‌బాబు టైమింగ్ కుదిరితే ఎలా వుంటుందో ఈ చిత్రంలో చూస్తారు. శ్రీనువైట్ల, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తోన్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కన్నులపండువలా వుంటుంది. నిర్మాణపరంగా కూడా ఎక్కడా రాజీపడలేదు. పరిక్షిశమలో సమ్మెకారణంగా బడ్జెట్ కొంచెం ఎక్కువయింది’ అన్నారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, షాయాజీషిండే, నాజర్, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపావూతల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జి.రమేష్‌బాబు.
0 comments:
Post a Comment