‘శ్రీను వైట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. దూకుడు షూటింగ్ ఒక పిక్నిక్‌లా సాగింది. షూటింగ్ జరిగిన 9నెలలు చాలా ఆనందంగా గడిపాను. శ్రీను వైట్ల నాన్న గారికి పెద్ద అభిమాని. ఆ అభిమానంతో ‘దూకుడు’ లాంటి మంచి సినిమా నాకు అందించినందుకు శ్రీను వైట్లకు జీవితాంతం రుణపడి వుంటాను’ అన్నారు మహేష్.మహేష్ మాట్లాడుతూ‘ ఈ ఆడియో ఫంక్షన్ చూస్తుంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌లా వుంది. మణిశర్మ దగ్గర థమన్ కీబోర్డ్ ప్లేయర్‌గా వున్నప్పటి నుంచి తెలుసు. థమన్ ‘దూకుడు’ సాంగ్స్ అదరగొట్టాడు. ఇంత వరకు ఇలాంటి నిర్మాతలతో వర్క్ చేయలేదు. ఎక్కడా రాజీపడకుండా చాలా చక్కగా చిత్రాన్ని నిర్మించారు. ‘దూకుడు’ విడుదల కోసం అందరి లాగే నేనూ ఎదురు చూస్తున్నా. వచ్చేనెల సినిమా విడుదల కాబోతోంది. ఆరోజు అభిమానులందరికీ పండగే’అన్నారు.
మహేష్ అంటే నాకు ప్రాణం. తను పెద్ద స్టార్ అయినా నేను డైరెక్ట్ చేస్తున్నంత సేపు ఒక తమ్ముడ్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణం మ హేష్‌బాబే. ‘భయానికి మీనింగే తెలీని బ్లడ్‌రా నాది’ అనే డైలాగ్‌కి కృష్ణ గారి వ్యక్తిత్వమే స్ఫూర్తి’ అన్నారు.
0 comments:
Post a Comment