‘అతడు’ ఓ అంతర్ముఖుడు... నిండు గాంభీర్యంగా కనిపించే నెమ్మదస్తుడు’ ఇది మహేష్‌పై చాలామంది అభిప్రాయం. కానీ ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే అంతే... బ్లయిండ్‌గా వెళ్లిపోయే మొండితనం, ఆయన సొంతం అని చాలా తక్కువ మందికి తెలుసు. ‘దూకుడు’గా సినిమాలు చేయాలని మహేష్ నిశ్చయించుకున్న తర్వాత రోజుకు 12 గంటల పాటు షూటింగ్ స్పాట్‌లోనే ఉంటున్నారాయన. ఈ నెల చివరిలో కానీ, వచ్చేనెల ప్రథమార్ధంలో కానీ ‘దూకుడు’ విడుదల కానుంది. ‘పోకిరి’గా బాక్సాఫీస్ వసూళ్లకు కొత్త అర్థం చెప్పిన మహేష్... రాబోతున్న ‘దూకుడు’తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో అని ఆయన అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను మరింత పెంచడానికి ఈ నెల 13న ‘దూకుడు’ పాటలు విడుదలవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ‘బిజినెస్‌మ్యాన్’ చిత్రంలో ఆయన నటించనున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత బోయపాటి శ్రీను, రాజమౌళి, క్రిష్... సినిమాలు ఆయన చేస్తారని ఫిలింనగర్ సమాచారం. సో... ఇది మహేష్ అభిమానులకే కాదు... తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఓ మంచి వార్త అని చెప్పొచ్చు. నేడు మహేష్‌బాబు పుట్టిన రోజు. నేటితో 37వ పడిలోకి అడుగుపెడుతున్నారాయన. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ‘సూపర్‌స్టార్’ అభిమానులకు ఈ రోజు నిజంగా ఓ పండుగే.


0 comments:
Post a Comment