skip to main |
skip to sidebar
ఈ రోజు ఖాళీగా కూర్చుని... పదేళ్ల తరవాత నా పరిస్థితి ఏమిటో..? అని గాల్లో మేడలు కట్టే మనస్తత్వం కాదతనిది. ఇప్పుడు చేసిన పని వందేళ్లు గడిచినా గర్వంగా చెప్పుకోవాలి అనుకొంటాడు. ప్రతి అడుగూ చరిత్రగా మారాలని భావిస్తాడు. సాహసమే సోపానంగా చేసుకొని ముందడుగు వేసిన ఆ యువకుడి లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా సాధించాడు? ఈ విషయాలు తెలియాలంటే 'దూకుడు' సినిమా చూడాల్సిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సమంత నాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో పాటల్ని విడుదల చేయబోతున్నారు. యాక్షన్, వినోదం, సంగీతం.... ఈమూడూ సమపాళ్లలో మేళవించిన సినిమా ఇది. కథ, కథనాలు ఎవరూ ఊహహంచని విధంగా ఉంటాయి. మహేష్‌బాబు పాత్ర చిత్రణ ప్రధాన ఆకర్షణ అని చిత్రబృందం చెబుతోంది. తమన్ సంగీతం అందించారు.
Posted in:
Dookudu,
maheshbabu,
prince,
Samantha,
Srinu Vaitla,
telugu,
దూకుడు,
మహేష్,
మహేష్‌బాబు,
శ్రీను వైట్ల,
సమంత
0 comments:
Post a Comment