''భయానికి మీనింగంటే తెలియని బ్లడ్‌రా నాది " - అని దూకుడులో ఓ డైలాగ్ ఉంది. దీనికి స్ఫూర్తి కృష్ణ వ్యక్తిత్వమే. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామ''న్నారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'దూకుడు'. మహేష్‌బాబు, సమంత జంటగా నటించారు. ఈ చిత్రంలోని గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించారు. సుకుమార్ స్వీకరించారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే వంద రోజుల వేడుకలా ఉంది. తమన్ చక్కటి బాణీలు అందించాడు. శ్రీను వైట్ల నాన్నగారికి పెద్ద అభిమాని. చిత్రీకరణ జరిగిన తొమ్మిది నెలలు ఓ విహార యాత్రలా గడిచింది. దూకుడు విడుదల నా అభిమానులకు పండగే'' అని చెప్పారు. ''ప్రేక్షకులు దూకుడు పై పెట్టుకున్న అంచనాలను కచ్చితంగా చేరుకుంటామ''న్నారు చిత్ర దర్శకుడు. సమంత మాట్లాడుతూ ''మహేష్‌బాబుకి పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నాకిదో ప్రత్యేకమైన చిత్రం'' అన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, నమ్రత, బ్రహ్మానందం, తమన్, జి.ఆదిశేషగిరిరావు, భోగవల్లి ప్రసాద్, దిల్ రాజులతోపాటు చిత్ర నిర్మాతలు రామ్, గోపీ, అనిల్ పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.
0 comments:
Post a Comment