రికార్డు కలెక్షన్ల ‘దుకుడు’

మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ‘దూకుడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాతలు సినిమాకి వస్తోన్న కలెక్షన్ల వివరాలు తెలియజేస్తూ ‘మొదటి వారం రోజుల్లోనే 50 కోట్ల 7లక్షలకుపైగా గ్రాస్, 35 కోట్ల 1లక్ష షేర్ సాధించి ఎనభై సంవత్సరాల తెలుగు చలన చిత్ర రికార్డును తిరగరాసింది. నైజాంలో మొదటివారం 12 కోట్ల 51లక్షలు, ఆంధ్రలో 13 కోట్ల 10లక్షలు, సీడెడ్‌లో 6కోట్ల 30 లక్షలు, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, ఉత్తర భారతదేశంలో 6 కోట్ల 50 లక్షలకు పైగా వసూళ్లను సాధించింది. విదేశాల్లో 11 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ‘దూకుడు’ చిత్ర విజయంపై పత్రికల్లో ప్రత్యేక కథనాలు...

శ్రీను వైట్ల మాటల్లో మహేష్‌బాబు

సాధారణంగా ప్రతి సినిమాలో కథానాయకుడు ఒక్కడే ఉంటాడు. కథంతా అతని చుట్టే తిరుగుతుంది కాబట్టి... థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడి దృష్టి అతని మీదే ఉంటుంది. శ్రీను వైట్ల సినిమాలకు వెళ్లేటప్పుడు ఈ అభిప్రాయాన్ని చెరిపేసుకోవచ్చు. ఎందుకంటే... సన్నివేశం ఓ హీరోలా కనిపిస్తుంది. అందులో కనిపించే ప్రతీ పాత్రా వినోదం పండించడానికి పోటీపడుతుంది. ఓ వైపు కథానాయకుడు ఆటాడించేస్తూనే ఉంటాడు. ఎక్కడా మాస్‌, యాక్షన్‌ తగ్గనీయడు. మరో వైపు మెక్‌డొనాల్డ్‌ మూర్తో, చికాగో సుబ్బారావో, బొక్కా వెంకట్రావో... చక్కిలిగింతలు పెట్టేస్తుంటాడు. తాజాగా మహేష్‌బాబు 'దూకుడు'ని తన శైలిలో చూపించి వినోదం పంచారు శ్రీను వైట్ల. ఈ సందర్భంగా ఆయనతో ఈనాడు సినిమా ప్రత్యేకంగా సంభాషించింది. 'దూకుడు' ఫలితం ఎలాంటి అనుభూతినిచ్చింది? 'దూకుడు' విడుదలైన మరునాడే నా పుట్టిన రోజు. ఘన విజయంతో తెలుగు...

అభిమానుల మధ్య మహేష్‌బాబు 'దూకుడు'

మహేష్‌బాబు 'దూకుడు'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలైన రోజునే ఆయన తన అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. మహేష్‌, నమ్రత దంపతులు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌కి శుక్రవారం ఉదయం వచ్చారు. జి.ఆదిశేషగిరిరావు, శ్రీను వైట్ల, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట తదితరులు కథానాయకుడితో కలిసి చిత్రం చూశారు. మహేష్‌తమతో కలిసి చిత్రం చూడటంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఆయన అందరికీ అభివాదం చేశారు. అలాగే కృష్ణ, విజయనిర్మల సినీమాక్స్‌లో చిత్రం వీక్షించారు. ప్రదర్శన అనంతరం కృష్ణ మాట్లాడుతూ మహేష్‌ నటనను మెచ్చుకొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపార...

దూకుడు

సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: మహేష్‌బాబు, సమంత, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్‌, సాయాజీషిండే, నాజర్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మాస్టర్‌ భరత్‌ తదితరులు సంగీతం: తమన్‌ నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర దర్శకత్వం: శ్రీను వైట్ల విషయం: అజయ్‌(మహేష్‌బాబు)కి దూకుడెక్కువ. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకోవలసిందే. అలా తీసుకొన్న ఓ నిర్ణయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వృత్తి తరవాత ఎక్కువగా ఇష్టపడేది తన కుటుంబాన్ని. అతని జీవితంలోకి ప్రశాంతి (సమంత) ప్రవేశిస్తుంది. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీద చూసి తెలుసుకోవలసిందే. విశేషాలు: నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రీకరణ ప్రధాన ఆకర్షణ. వృత్తిగత జీవితంలో అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఛేదించిన విధానం ఉత్కంఠపరుస్తాయి. ఆయన నటన అందరికీ నచ్చుతుంది. కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా...

23న ‘దూకుడు’

మహేష్‌బాబు కథానాయకుడిగా 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘దూకుడు’ చిత్రం ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మా చిత్రానికి సెన్సార్ పూర్తికాలేదని, ఎప్పుడు విడుదలవుందో తెలియదనే ఊహాగానాలు వెలువడ్డాయి. వాటన్నింటిని మేము ఖండిస్తున్నాం. చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. ఒక్క నైజాంలోనే దాదాపు 200పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. తొలిసారిగా పైరసీని అరికట్టడానికి కోర్టు ద్వారా ‘జాన్ డో’ ఉత్తర్వులను పొందాము. దీని ప్రకారం మా చిత్ర విజువల్స్‌గానీ, ఆడియోగాని, ఏ రూపంలో అనగా డిజిటల్ ఫార్మెట్‌లోగాని ఆన్‌లైన్ అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ చేయడం నేరం. ఎవరైనా కోర్టువారి ఉత్తర్వులు ఉల్లంఘించి కాపీరైట్ చౌర్యానికి పాల్పడితే...

ముంబయిలో 'బిజినెస్‌ మేన్‌'

మహేష్‌బాబు - పూరి జగన్నాథ్‌... వీరి పేర్లు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం 'పోకిరి'. ఆ తరవాత వీరి నుంచి వస్తున్న చిత్రం 'బిజినెస్‌ మేన్‌'. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''మళ్లీ పోకిరి బృందం నుంచి ఓ సినిమా రావడం ఆనందంగా ఉంది. అన్ని వాణిజ్య అంశాలు మేళవించిన కథతో బిజినెస్‌ మేన్‌ సిద్ధమవుతోంద''న్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌ పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. త్వరలో హైదరాబాద్‌లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ''న్నారు నిర్మాత. వచ్చే యేడాది జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నారు. ప్రకాష్‌రాజ్‌, సాయాజీషిండే, నాజర్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: తమన...

‘దూకుడు’లో స్టెప్స్ సూపర్బ్

‘‘టాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్‌లో ఒకటిగా రేపు ‘దూకుడు’ నిలువబోతోంది. పెర్‌ఫార్మెన్స్ పరంగా ఇందులో ఓ కొత్త సమంతాను చూస్తారు’’ అని ధీమాగా చెబుతున్నారు అందాలభామ సమంత. త్వరలో విడుదల కానున్న ‘దూకుడు’ సినిమా గురించి మాట్లాడుతూ సమంత పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి నేర్చుకున్నాను. తొలి సినిమా ‘ఏం మాయ చేసావె’లో డాన్స్‌లో నా నైపుణ్యాన్ని చూపించే అవకాశం రాలేదు. ఇక రెండో సినిమా ‘బృందావనం’లో ఆ అవకాశం వచ్చినా... అది పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ‘దూకుడు’లో మాత్రం నా ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం కలిగింది. ఇందులో స్టెప్స్ సూపర్బ్‌గా ఉంటాయి. మహేష్ మార్క్ స్టైలిష్ డాన్సులతో పాటు, ఎన్నో వైరైటీ డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో చేసే అవకాశం దొరికింది నాకు. డాన్సుల పరంగానే కాదు.. నటన పరంగా కూడా నాకు పూర్తిస్థాయి సంతృప్తినిచ్చిన సినిమా ‘దూకుడు’....

ఓ వైపు ఆటో సుబ్బారావు..

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, పార్వతీమెల్టన్‌పై 'ఓ వైపు హాయ్‌ అంటాడు ఆటో సుబ్బారావు..' అనే గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈపాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈనెల 23న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం కలగలిపిన చిత్రమిది. 'మైండ్‌లో ఫిక్సయితే బ్త్లెండ్‌గా దూసుకుపోతా..' 'భయానికి మీనింగు తెలియని బ్లడ్‌రా నాది..' ఇలా మహేష్‌ పలికే సంభాషణలు అందరినీ ఆకట్టుకొంటాయి. మహేష్‌ అభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది. సమంత పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. తమన్‌ బాణీలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న...

మహేష్ మాస్ మసాలా ‘దూకుడు’

‘భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది’ అంటూ మహేష్ త్వరలో వెండితెర మీదికి ‘దూకుడు’గా రాబోతున్నాడు. ఆయన అభిమానులు ఆయన నుంచి ఎదురుచూస్తున్న మాస్ మసాలా వినోదాన్ని ఈ చిత్రం ద్వారా పంచబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని రీతిలో దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ను ‘దూకుడు’లో ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సమంత నాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కాబోతుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.రమేష్‌బాబు సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్, పార్వతీమెల్టన్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో పార్వతీ హాట్ హాట్‌గా కనిపించనుందని యూనిట్ వర్గాలు చెపుకుంటున్నాయి. ఇక ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానున్న...

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దిల్‌రాజు బేనరులో వెంకటేష్, మహేష్ నటిస్తున్న

ఇది ఏప్రిల్ ఫూల్ వార్త కాదు. ఇది నిజంగా నిజం. అగ్ర కథానాయకులు వెంకటేష్, మహేష్‌బాబు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఈ వార్త అతి త్వరలోనే నిజం కాబోతోంది. నిజమైన మల్టీస్టారర్‌కు నిర్వచనంగా నిలిచే ఈ చిత్రం టైటిల్ కూడా సరికొత్త పంథాలో ఉండబోతోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసినట్టుగా సమాచారం. వరుస విజయాల పరుసవేదిగా పేరు తెచ్చుకున్న ‘దిల్’రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2008లో ‘కొత్త బంగారులోకం’తో తన సృజనను చాటుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మూడేళ్లు శ్రమించి ఈ మల్టీస్టారర్ స్క్రిప్టును సిద్ధం చేశారు. కానీ, వెంకటేష్-పవన్‌కళ్యాణ్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. వెంకటేష్, మహేష్‌లకు స్క్రిప్టు నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపినట్టుగా...

రామోజీ ఫిలింసిటీలో 'దూకుడు' గీతం

దసరా బరిలో సందడి చేసేందుకు మహేష్‌బాబు సిద్ధమవుతున్నారు... 'దూకుడు' చిత్రంతో. ఆ సినిమాకి సంబంధించిన గీతాన్ని ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ని సిద్ధం చేశారు. మహేష్‌, సమంతలపై చిత్రిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తవుతాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 'దూకుడు' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర తెలిపారు. తమన్‌ స్వరపరచిన గీతాలు ఇటీవలే శ్రోతల ముందుకొచ్చా...

మహేష్ బిజినెస్ మొదలైంది

మహేష్, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ‘బిజినెస్ మేన్’ షూటింగ్ సెప్టెంబర్ 2న శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రారంభమైంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ‘ ‘పోకిరి’ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. మా ఇద్దరి కలయికలో అద్భుతమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. మా ఇద్దరి కలయికలో నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా పెద్ద సినిమా కాబోతోంది. ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలున్న స్క్రిస్ట్ ఇది’అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ‘ మహేష్‌తో ‘పోకిరి’ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇందులో మహేష్ పాత్ర చిత్రణ, ఆయన చెప్పే డైలాగ్స్ అద్భుతంగా వుంటాయి.ఎక్కడా రాజీపడకుండా నిర్మాత వెంకట్ చిత్రాన్ని చాలా చక్కగా నిర్మిస్తున్నారు’అని తెలిపారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ‘టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో ...

Pages 311234 »

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates