మహేష్, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై
వెంకట్ నిర్మిస్తున్న ‘బిజినెస్ మేన్’ షూటింగ్ సెప్టెంబర్ 2న శంషాబాద్
ఎయిర్ పోర్ట్‌లో ప్రారంభమైంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సందర్బంగా మహేష్
మాట్లాడుతూ‘ ‘పోకిరి’ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేయడం
ఆనందంగా వుంది. మా ఇద్దరి కలయికలో అద్భుతమైన కథతో రూపొందుతున్న చిత్రమిది.
మా ఇద్దరి కలయికలో నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా పెద్ద
సినిమా కాబోతోంది. ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలున్న
స్క్రిస్ట్ ఇది’అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ‘ మహేష్‌తో ‘పోకిరి’
తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇందులో మహేష్ పాత్ర చిత్రణ, ఆయన చెప్పే
డైలాగ్స్ అద్భుతంగా వుంటాయి.ఎక్కడా రాజీపడకుండా నిర్మాత వెంకట్ చిత్రాన్ని
చాలా చక్కగా నిర్మిస్తున్నారు’అని తెలిపారు. నిర్మాత వెంకట్
మాట్లాడుతూ‘టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నాం. ఈ నెల 10 వరకు హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ నెల 11 నుంచి
డిసెంబర్ 25 వరకు ఒకే షెడ్యూల్లో ముంబాయి, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్
జరుపుతాం.
జనవరి 12న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని
ప్లాన్ చేస్తున్నాం’అన్నారుపకాష్‌రాజ్, షాయాజీ షిండే, ధర్మవరపు
సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్
బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్,
కెమెరా: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్:
ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, సహ నిర్మాత: వి. సురేష్ రెడ్డి, నిర్మాత:
డా. వెంకట్, కథ-వూస్కీన్‌ప్లే- దర్శకత్వం: పూరి జగన్నాథ్
0 comments:
Post a Comment