మహేష్‌బాబు కథానాయకుడిగా 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘దూకుడు’ చిత్రం ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మా చిత్రానికి సెన్సార్ పూర్తికాలేదని, ఎప్పుడు విడుదలవుందో తెలియదనే ఊహాగానాలు వెలువడ్డాయి. వాటన్నింటిని మేము ఖండిస్తున్నాం. చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. ఒక్క నైజాంలోనే దాదాపు 200పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. తొలిసారిగా పైరసీని అరికట్టడానికి కోర్టు ద్వారా ‘జాన్ డో’ ఉత్తర్వులను పొందాము. దీని ప్రకారం మా చిత్ర విజువల్స్‌గానీ, ఆడియోగాని, ఏ రూపంలో అనగా డిజిటల్ ఫార్మెట్‌లోగాని ఆన్‌లైన్ అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ చేయడం నేరం. ఎవరైనా కోర్టువారి ఉత్తర్వులు ఉల్లంఘించి కాపీరైట్ చౌర్యానికి పాల్పడితే చట్టవూపకారం చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
0 comments:
Post a Comment