మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, పార్వతీమెల్టన్‌పై 'ఓ వైపు హాయ్ అంటాడు ఆటో సుబ్బారావు..' అనే గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈపాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈనెల 23న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''యాక్షన్ అంశాలతో పాటు వినోదం కలగలిపిన చిత్రమిది. 'మైండ్‌లో ఫిక్సయితే బ్త్లెండ్‌గా దూసుకుపోతా..' 'భయానికి మీనింగు తెలియని బ్లడ్‌రా నాది..' ఇలా మహేష్ పలికే సంభాషణలు అందరినీ ఆకట్టుకొంటాయి. మహేష్ అభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది. సమంత పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. తమన్ బాణీలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పోయ్..పోయ్ పాట మాస్‌కి బాగా నచ్చుతుంద''న్నారు.
0 comments:
Post a Comment