మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్
ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
నిర్మించిన ‘దూకుడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా
నిర్మాతలు సినిమాకి వస్తోన్న కలెక్షన్ల వివరాలు తెలియజేస్తూ ‘మొదటి వారం
రోజుల్లోనే 50 కోట్ల 7లక్షలకుపైగా గ్రాస్, 35 కోట్ల 1లక్ష షేర్ సాధించి
ఎనభై సంవత్సరాల తెలుగు చలన చిత్ర రికార్డును తిరగరాసింది.
నైజాంలో మొదటివారం 12 కోట్ల 51లక్షలు, ఆంధ్రలో 13 కోట్ల 10లక్షలు, సీడెడ్‌లో 6కోట్ల 30 లక్షలు, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, ఉత్తర భారతదేశంలో 6 కోట్ల 50 లక్షలకు పైగా వసూళ్లను సాధించింది. విదేశాల్లో 11 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ‘దూకుడు’ చిత్ర విజయంపై పత్రికల్లో ప్రత్యేక కథనాలు వెలువడడం చూస్తుంటే మా చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలుస్తోంది’ అన్నారు.
0 comments:
Post a Comment