మహేష్‌బాబు - పూరి జగన్నాథ్... వీరి పేర్లు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం 'పోకిరి'. ఆ తరవాత వీరి నుంచి వస్తున్న చిత్రం 'బిజినెస్ మేన్'. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తోంది. వెంకట్ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''మళ్లీ పోకిరి బృందం నుంచి ఓ సినిమా రావడం ఆనందంగా ఉంది. అన్ని వాణిజ్య అంశాలు మేళవించిన కథతో బిజినెస్ మేన్ సిద్ధమవుతోంద''న్నారు. ''ఈ చిత్రంలో మహేష్ పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. త్వరలో హైదరాబాద్‌లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ''న్నారు నిర్మాత. వచ్చే యేడాది జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నారు. ప్రకాష్‌రాజ్, సాయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, సంగీతం: తమన్.
0 comments:
Post a Comment