సంస్థ: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: మహేష్‌బాబు, సమంత, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, సాయాజీషిండే, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మాస్టర్ భరత్ తదితరులు
సంగీతం: తమన్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
దర్శకత్వం: శ్రీను వైట్ల
విషయం: అజయ్(మహేష్‌బాబు)కి దూకుడెక్కువ. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకోవలసిందే. అలా తీసుకొన్న ఓ నిర్ణయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వృత్తి తరవాత ఎక్కువగా ఇష్టపడేది తన కుటుంబాన్ని. అతని జీవితంలోకి ప్రశాంతి (సమంత) ప్రవేశిస్తుంది. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీద చూసి తెలుసుకోవలసిందే.
విశేషాలు: నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రీకరణ ప్రధాన ఆకర్షణ. వృత్తిగత జీవితంలో అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఛేదించిన విధానం ఉత్కంఠపరుస్తాయి. ఆయన నటన అందరికీ నచ్చుతుంది. కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా తీర్చిదిద్దారు. బ్రహ్మానందం పాత్ర మరోసారి వినోదం పండిస్తుంద''న్నారు.
విడుదల: శుక్రవారం.
0 comments:
Post a Comment