మహేష్‌బాబు 'దూకుడు'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలైన రోజునే ఆయన తన అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.
మహేష్, నమ్రత దంపతులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌కి శుక్రవారం ఉదయం వచ్చారు. జి.ఆదిశేషగిరిరావు, శ్రీను వైట్ల, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట తదితరులు కథానాయకుడితో కలిసి చిత్రం చూశారు. మహేష్‌తమతో కలిసి చిత్రం చూడటంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఆయన అందరికీ అభివాదం చేశారు. అలాగే కృష్ణ, విజయనిర్మల సినీమాక్స్‌లో చిత్రం వీక్షించారు. ప్రదర్శన అనంతరం కృష్ణ మాట్లాడుతూ మహేష్ నటనను మెచ్చుకొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
0 comments:
Post a Comment