దసరా బరిలో సందడి చేసేందుకు మహేష్‌బాబు సిద్ధమవుతున్నారు... 'దూకుడు' చిత్రంతో. ఆ సినిమాకి సంబంధించిన గీతాన్ని ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ని సిద్ధం చేశారు. మహేష్, సమంతలపై చిత్రిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తవుతాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'దూకుడు' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. తమన్ స్వరపరచిన గీతాలు ఇటీవలే శ్రోతల ముందుకొచ్చాయి.
0 comments:
Post a Comment