ఇది ఏప్రిల్ ఫూల్ వార్త కాదు. ఇది నిజంగా నిజం. అగ్ర కథానాయకులు వెంకటేష్, మహేష్‌బాబు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఈ వార్త అతి త్వరలోనే నిజం కాబోతోంది. నిజమైన మల్టీస్టారర్‌కు నిర్వచనంగా నిలిచే ఈ చిత్రం టైటిల్ కూడా సరికొత్త పంథాలో ఉండబోతోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసినట్టుగా సమాచారం.
వరుస విజయాల పరుసవేదిగా పేరు తెచ్చుకున్న ‘దిల్’రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2008లో ‘కొత్త బంగారులోకం’తో తన సృజనను చాటుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మూడేళ్లు శ్రమించి ఈ మల్టీస్టారర్ స్క్రిప్టును సిద్ధం చేశారు. కానీ, వెంకటేష్-పవన్‌కళ్యాణ్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి.
వెంకటేష్, మహేష్‌లకు స్క్రిప్టు నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపినట్టుగా సమాచారమ్. నవంబర్ నెలాఖరున కానీ, డిసెంబర్ మొదటి వారంలో కానీ చిత్రీకరణ మొదలు పెట్టడానికి దిల్‌రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా కనిపిస్తారనేది సమాచారం. ప్రకాశ్‌రాజ్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.
0 comments:
Post a Comment