BusinessMan in Post Production



మహేష్ ,కాజల్ జంటగా ఆర్.ఆర్ మూవీమేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘బిజినెస్8మేన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌వూపొడక్షన్ వర్క్‌లో భాగంగా రీ రికార్డింగ్ జరుగుతోంది. ఈ నెల 22న తెలుగు, తమిళ, మలయాళంలో ఆడియో విడుదల చేస్తున్నాం. జనవరి 11న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం.

‘పోకిరి’ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో సూర్యగా మహేష్ అద్భుతంగా నటించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభిస్తోంది. థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు’ అన్నారు. ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్8, ఛాయాక్షిగహణం: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్, ఎస్8.ఆర్.శేఖర్.

Business Man Shooting Completed

ఆరు నెలల క్రితం ‘బిజినెస్‌మేన్’ ఓపెనింగ్ రోజున ‘‘2012 జనవరి 11న ‘బిజినెస్‌మేన్’ని విడుదల చేస్తాం’’ అని ప్రకటించారు పూరీజగన్నాథ్. అన్నమాటను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో... డిసెంబర్ 10 నాటికే షూటింగ్‌ని పూర్తి చేశారాయన. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా పూరీ తెలియజేశారు. ‘‘మహేష్‌బాబు ఈ సినిమా కోసం 65 రోజులు పనిచేశారు. కాజల్ 30 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కేవలం 74 రోజుల్లో 84వేల అడుగుల ఎక్స్‌పోజర్‌తో అనుకున్న ప్రకారం పర్‌ఫెక్ట్‌గా షూటింగ్‌ని పూర్తి చేయగలిగాం. ఇంత పెద్ద సినిమాను రికార్డ్ టైమ్‌లో పూర్తి చేయగలిగానంటే దానికి కారణం యూనిట్ సభ్యుల సపోర్టే.

‘పోకిరి’ తర్వాత నేను, మహేష్ కలిసి పనిచేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరి అంచనాలనూ అందుకునే విధంగా సినిమా ఉంటుంది. ఇందులో మహేష్ పాత్ర పేరు ‘సూర్య’. హీరోయిజాన్ని పీక్ లెవల్‌కి తీసుకెళ్లే విధంగా ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది. అలాగే మహేష్, కాజల్‌పై చిత్రీకరించిన పాటలు కూడా కలర్‌ఫుల్‌గా వచ్చాయి. ఇప్పటివరకూ విడుదల చేసిన రెండు టీజర్స్‌కీ అద్భుతమైన స్పందన వస్తోంది. తమన్ ఈ సినిమాకు వినసొంపైన బాణీలను అందించారు.

డిసెంబర్ 22న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘బిజినెస్‌మేన్’ పాటలను విడుదల చేయనున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. జనవరి 11న సినిమా విడుదల చేస్తాం’’ అని పూరీజగన్నాథ్ చెప్పారు. ప్రకాష్‌రాజ్, సయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్‌రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: వెంకట్, నిర్మాణం: ఆర్.ఆర్.మూవీ మేకర్స్.

Mahesh Sukumars Movie On sets from March 2012

మహేష్‌బాబుతో తాజాగా ‘దూకుడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు రామ్‌అచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తదుపరి చిత్రాన్ని కూడా మహేష్‌బాబు కథానాయకుడిగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభకానున్నట్లు సమాచారం. దిల్‌రాజ్ నిర్మిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కూడా మహేష్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Bussiness Man Audion On 22nd December

మహేష్ కథానాయకుడిగా ఆర్. ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘బిజినెస్‌మెన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం కోసం బ్యాంకాక్, పటాయ, క్రాబిలలో రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ ఈ నెల 2 నుంచి 10 వరకు జరిగే ప్యాచ్‌వర్క్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం తొలి భాగం రీ-రికార్డింగ్ ప్రారంభమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరుకు తొలికాపీ సిద్ధం చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెల 22న తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్‌లకు సంబంధించిన ఆడియోని విడుదల చేయబోతున్నాం. జనవరి 11న అత్యధిక థియేటర్లలో ‘బిజినెస్‌మెన్’ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మహేష్, పూరి జగన్నాథ్ ఈ చిత్రంలోని థీమ్ సాంగ్‌ను పాడటం విశేషం. ‘పోకిరి’లో పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఎలా ప్రాచుర్యం పొందాయో అంతకు రెట్టింపు స్థాయిలో ‘బిజినెస్‌మెన్’లోని డైలాగ్స్ పాపులర్ అవుతాయి. మహేష్ కెరీర్‌లో ‘బిజినెస్‌మెన్’ మరో పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతోంది’ అన్నారు. కాజల్ పకాష్‌రాజ్, షాయాజీ షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్, సినిమాటోగ్రఫీ: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్

Mahesh Singing in Businessman

సినీ పరిక్షిశమలో కథానాయకులు నటిస్తూనే కొత్త శాఖల్లోనూ తమ ప్రతిభని చూపించడానికి ప్రయత్నించిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈ తరం క్రేజీ హీరోలైన పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్‌లు తెరపై జిమ్మిక్కులు చేస్తూనే సింగర్లుగానూ తమ గాన కౌశలాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. త్వరలోనే మహేష్ వీరి జాబితాలో చేరనున్నాడు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి మహేష్ ఓ థీమ్‌సాంగ్‌ను ఆలపిస్తున్నాడట. ఇప్పటి వరకు ఏ చిత్రం కోసం గొంతు సవరించని మహేష్ తొలిసారి ‘బిజినెస్‌మెన్’ చిత్రం కోసం గాయకుడిగా మారుతుండటం విశేషం.మహేష్ గీతాలాపన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ఆడియోని డిసెంబర్‌లో మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారని సమాచారం.

Bussiness Man audio on 23 Dec

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌ మేన్‌'. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్నారు. దినేష్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్‌-పూరి కలయికలో 'పోకిరి' తర్వాత వస్తున్న చిత్రమిది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ నటన, హావభావాలు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. ముంబయిలో చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 'ఇలా రౌండప్‌ చేసి నన్ను కనఫ్యూజ్‌ చేయొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అనే సంభాషణతో ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది.
 


ఈ నెలాఖరు వరకు బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తాం. వచ్చే నెల 1 నుంచి హైదరాబాద్‌లో మహేష్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, అలీ తదితరులు పాల్గొనే సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. డిసెంబరు 23న పాటల్ని విడుదల చేస్తామ''ని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె నాయుడు, సంగీతం: తమన్‌.

Mahesh Pairing with Tamanna

దటీజ్‌ మహాలక్ష్మీ... అంటూ '100% లవ్‌' సినిమాలో తమన్నా పాత్రని తీర్చిదిద్దారు సుకుమార్‌. అందం, తెలివితేటలు కలబోసిన మరదలి పిల్లగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకొంది. మరోసారి ఆ భామనే కథానాయికగా ఎంచుకొన్నట్లు తెలిసింది. మహేష్‌బాబు - సుకుమార్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కథానాయిక పాత్ర తమన్నాకి దక్కింది.

 
ప్రస్తుతం మహేష్‌బాబు 'బిజినెస్‌మేన్‌' చిత్రీకరణలో ఉన్నారు. ఇది పూర్తికాగానే సుకుమార్‌ చిత్రం సెట్స్‌ మీదకు వెళుతుంది. వచ్చే యేడాది ప్రథమార్థంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Mahesh New Movie in Vijayanthi Movies Banner

భారీ చిత్రాలకు చిరునామా... ‘వైజయంతీ మూవీస్’ సంస్థ. ఈ బేనరు నుంచి సినిమా అంటే... సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు అధికంగా ఉంటాయి. అటువంటిది మహేష్‌బాబుతో సినిమా అంటే ఇక చెప్పనవసరంలేదు. అందులోనూ ‘దూకుడు’ వంటి సంచలన విజయం తర్వాత సినిమా అంటే ఆ అంచనాలు రెట్టింపుగా ఉంటాయి.

ఇక ఆ చిత్రానికి క్రియేటివ్ డెరైక్టర్ ‘క్రిష్’ అంటే ‘క్రేజియస్ట్ సినిమా’ అని చెప్పాల్సివస్తుంది. ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ఓ భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపొందనుంది అని తెలిసింది. కృష్ణ కెరీర్‌లో ఓ ‘అల్లూరి సీతారామరాజు’లా మహేష్ కెరీర్‌లో ఈ సినిమా నిలిచిపోతుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం. మహేష్ ఇప్పటివరకూ చేయని కొత్తరకం ఫీట్ ఈ సినిమాలో చేస్తున్నారట.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు చేయబోవడం మరో అదనపు ఆకర్షణ. ఈ సినిమా ద్వారా తొలిసారి మహేష్‌బాబు సినిమాకి కీరవాణి సంగీతం అందించబోవడం మరో విశేషం. ఈ చిత్రానికి ‘తిరు’ ఛాయాగ్రాహణం అందిస్తారు. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఇది మొదలవుతుంది.

Dookudu 50 days Celebrations

''దూకుడు చిత్రం ఇన్ని రికార్డులు సాధించటానికి అభిమానులే కారణం. నాన్నను అభిమానించినవాళ్లే నాకు అభిమానులుగా మారటం అదృష్టం'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ సినిమా యాభై రోజుల వేడుకను విజయవాడలో నిర్వహించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ''విజయవాడలో నేను రెండోసారి విజయోత్సవాన్ని చేసుకొంటున్నాను. ఇంతమంది ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను. దూకుడు చిత్రంలో నటించడం మంచి అనుభవం. అందరూ తదుపరి సినిమా గురించి అడుగుతున్నారు. అదీ త్వరలోనే మీ ముందుకు వస్తుంద''న్నారు.
 కృష్ణ ప్రసంగిస్తూ ''అద్భుతాలను ఎవరూ ముందుగా గుర్తించలేరు. గుర్తించిన తరవాత ఒప్పుకోక తప్పదు. దూకుడు చిత్రం తప్పకుండా ఓ అద్భుతమే. మహేష్‌ చిన్నతనం నుంచే ప్రతి షాట్‌లో డూప్‌లు లేకుండా నటించటానికి తాపత్రయపడేవాడ''న్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ 'నేను కృష్ణ అభిమానిని. మహేష్‌ను మొదటి నుంచి గమనించేవాడిని. ఆయన ఇమేజ్‌కు సరిపడే కథతోనే సినిమా తీశాను'' అన్నారు. ''నేను ఏ సినిమా అయినా ఒకసారే చూస్తాను. దూకుడు చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మహేష్‌ అందం, నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఎన్టీఆర్‌ ప్రధానమంత్రి కావాలన్న అందరి ఆశని దర్శకుడు ఈ చిత్రంలో నిజం చేశార''న్నారు విజయనిర్మల. సినిమాలో మహేష్‌, చిత్ర కథానాయిక సమంత ధరించిన వస్త్రాలను 'మా' ఆధ్వర్యంలో వేలం వేయగా తిరుపతికి చెందిన మధుసూదనరెడ్డి, ప్రిన్స్‌మహేష్‌.కామ్‌ రవి వాటిని కొనుగోలు చేశారు. వారికి ఆ దుస్తులను వేదికపై మహేష్‌, సమంత అందజేశారు. చిత్ర బృందానికీ, పంపిణీదారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, సి.అశ్వనీదత్‌, సాగర్‌, సురేష్‌బాబు, డా||కేఎల్‌ నారాయణ, సమంత, సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Bussiness Man First Look is Out

‘ఇలా రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చేయొద్దు...ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కు కొట్టేస్తాను’ ఇది మహేష్‌బాబు ‘బిజినెస్‌మేన్’ ఫస్ట్ లుక్ ట్రైలర్స్‌లో ఓ డైలాగ్...ఈ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన తొలి స్టిల్‌ను విడుదల చేశారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహ నిర్మాత వి.సురేష్‌డ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ముంబాయ్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 8 లోగా చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో ఆడియోను విడుదల చేస్తాం.



జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమాని విడుదల చేస్తాం’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మహేష్‌బాబు హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరిస్తున్నాం. మహేష్‌బాబు సూపర్ పర్‌ఫ్మాన్స్ కనబరుస్తున్నాడు. ‘పోకిరి’ తర్వాత మహేష్‌తో చేస్తోన్న ఈ చిత్రం కొత్త చరివూతను సృష్టిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, భరత్‌డ్డి, రాజా తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోక్షిగఫీ: శ్యామ్ కె నాయుడు, ఫైట్స్: విజయ్, నిర్మాత: వెంకట్, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.



Krrish Directing Mahesh ?

కథల ఎంపికలో మహేష్‌బాబు వేగం పెంచారు. ప్రస్తుతం 'బిజినెస్‌మేన్‌' చిత్రీకరణలో ఉన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోనూ నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు మరో కొత్త కథకు పచ్చజెండా ఊపేశారు. ఈ కథను దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కథాంశం, మహేష్‌ పాత్ర నవ్యరీతిలో ఉంటాయని తెలిసింది. ఇందులో ముగ్గురు నాయికలుంటారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. సుకుమార్‌ చిత్రం తరవాత క్రిష్‌ సినిమా మొదలవుతుంది. 
కృష్ణం వందే జగద్గురుమ్‌: మహేష్‌ చిత్రానికంటే ముందు క్రిష్‌ 'కృష్ణం వందే జగద్గురుమ్‌' రూపొందిస్తారు. ఇందులో రానా దగ్గుబాటి కథానాయకుడు. ఈ సినిమాని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తారు. ఈ నెల 27 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు. కథానాయికను ఇంకా ఎంపిక చేయలేదు. గురువారం క్రిష్‌ జన్మదినం

Dhookudu 50 days function on November 12

పోకిరి’ తర్వాత ‘దూకుడు’తో మళ్లీ తన సత్తాను చాటుకున్న అందాల నటుడు మహేష్‌బాబు ఇప్పుడు ఆనందసాగరంలో మునిగివున్నారు. బాక్సాఫీసు రికార్డులను తనదైన శైలిలో తిరగరాయడమే కాకుండా, అమెరికా వంటి విదేశాల్లో కూడా అత్యధిక వసూళ్లతో తెలుగు సినిమా ‘స్టామినా’ని ‘దూకుడు’తో తెలియజెప్పారు మహేష్. ఇలాంటి సక్సెస్ కోసమే సూపర్‌స్టార్ అభిమానులు ఇంతకాలం ఎదురుచూశారు. తెలుగు చిత్రపరిశ్రమ కూడా ఇటువంటి విజయాలను ఆశిస్తూ వచ్చింది.



ఈ సినిమాకు లభించిన విజయాన్ని అంచనా వేసే పనిలో సినీ పండితులున్నారు. 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ ‘మగధీర’ అత్యధిక సొమ్ము వసూలు చేసిన చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సాధించింది. మరి ‘దూకుడు’ ఫైనల్‌గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుస్తుంది.

ఈ చిత్రానికి ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాతలు రామ్, గోపీచంద్, అనీల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నెల 12న విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ‘అర్ధశతదినోత్సవ’ వేడుకను ఘనంగా నిర్వహించలిచినట్లు తెలిపారు. ‘ఒక్కడు’ తర్వాత మహేష్‌బాబు పబ్లిక్ ఫంక్షన్‌లో పాల్గొనడం ఇదే అని చెప్పుకోవచ్చు. కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు ఈ ఉత్సవంలో భారీ ఎత్తున పాల్గొంటున్నట్లు తెలిసింది.

Bussiness man first look on 11 Nov

‘దూకుడు’ చిత్రంతో యమదూకుడు మీదున్న కథానాయకుడు మహేష్‌బాబు ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం రికార్డు స్థాయిలో తక్కువరోజుల్లో పూర్తి కాబోతోంది. ఇటీవల విడుదలైన ‘దూకుడు’ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘బిజినెస్‌మెన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 11న ఫస్ట్‌లుక్ విడుదల చేసి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఇందుమతి’ ఫేమ్ శ్వేతా భరద్వాజ్ ప్రత్యేక గీతంలో నర్తించనుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ దీపావళి కానుకగా విడుదల కానున్న ‘బిజినెస్‌మెన్’ ఇదే రోజు తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.

Bussiness Man Relasing on Sankranthi




 హేష్‌బాబు తన మార్కెట్‌ని ఇతర భాషలకీ విస్తరించబోతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుంది.
తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.



Business Man in Goa

'కొడితే ఒక్కొక్కడికీ బల్బులు పగిలిపోవాలి...' - అంటూ 'దూకుడు'లో తనదైన శైలిలో యాక్షన్‌లో వినోదం మేళవించారు మహేష్‌బాబు. ఇప్పుడు అచ్చమైన వ్యాపారవేత్త ఎలా ఉంటాడో చూపించబోతున్నారు. మహేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత.


ప్రస్తుతం గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ''మహేష్‌- పూరి జగన్నాథ్‌ కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు తెలుసు. వాటికి ఏ మాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉంటుంది. మహేష్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకొంటుంది. త్వరలో స్పెయిన్‌లో మూడు పాటలు చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

Mahesh Pairing with Tammanna ?

‘శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ చిత్రంలో మహేష్ గురించి బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుందా..! ‘ఢీ’ చిత్రంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఓ సన్నివేశంలో మహేష్ మిల్క్‌బాయ్‌లా వుంటాడు అంటాడు బ్రహ్మానందం..! ఇక ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే బ్రహ్మానందం పలికిన డైలాగ్‌లో ఆవగింజత కూడా అతిశయోక్తి లేదని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మహేష్ అచ్చంగా అలాగే వుంటాడు మరి..! అయితే తాజాగా ఈ మిల్క్‌బాయ్‌తో, మిల్కీవైట్ భామగా, ముట్టుకుంటే కందిపోయే అందాలతారగా భాసిల్లుతున్న తమన్నా జతకట్టబోతుంది. ఈ మిల్క్‌బాయ్, మిల్కీవైట్‌భామ జంటగా నటించనున్న చిత్రానికి ఇటీవల ‘100 పర్సెంట్ లవ్’తో విజయాన్ని దక్కించుకున్న సుకుమార్ దర్శకుడు.

ఇటీవలే మహేష్‌తో ‘దూకుడు’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకరలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న ఈ చిత్రంలో మహేష్ ఓ వైవిధ్యమైన గెటప్‌లో కనిపించబోతున్నాడని ఫిల్మ్‌నగర్ వార్త. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రంలో మహేష్‌తో జోడి కట్టే అవకాశం రావడం పట్ల తమన్నా ఎంతో హ్యాపీగా వుందట. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న తొలిచిత్రమిది కావడమే ఇందుకు కారణం.

Business Man Guns Dont Need Agrement

 'దూకుడు' ఎలా ఉంటుందో ఈ మధ్యే చూపించారు మహేష్‌బాబు. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే 'బిజినెస్‌మేన్‌'గా మారిపోయారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమది. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. 

ప్రస్తుతం ముంబైలో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 27 నుంచి గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''తుపాకీలకు ఒప్పందాలతో పనిలేదు. మనుషుల కన్నా.. బుల్లెట్లే ఎక్కువగా మాట్లాడతాయి. ఆ తరహా నేపథ్యంలో జరిగే కథ ఇది. యాక్షన్‌ అంశాలతోపాటు వినోదం కూడా మేళవించాం. మహేష్‌తో సినిమా తీస్తున్నానంటే అందరికీ 'పోకిరి' సినిమానే గుర్తొస్తుంది. ఇకపై మహేష్‌తో మరో సినిమా చేస్తే 'బిజినెస్‌మేన్‌' గుర్తుకు వస్తుంద''ని చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Krrish Directing Mahesh ?

‘దూకుడు’గా సినిమాలు చేస్తూ శిఖరాగ్రానికి దూసుకుపోతున్న మహేష్... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపారు. గమ్యం, వేదం, వానమ్ (తమిళం) చిత్రాలతో దక్షిణాదిన క్రేజీ దర్శకుడిగా భాసిల్లుతోన్న క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నట్టు తెలిసింది. అగ్రతారలతో అనేక విజయవంతమైన చిత్రాలు చేసిన ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.



ప్రస్తుతం మహేష్ ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేస్తారు. వాటి తర్వాత ఈ సినిమా మొదలు కావచ్చని సమాచారం. రానా కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రం నవంబర్‌లో మొదలు కానుంది. ఆ సినిమా తర్వాత క్రిష్ చేసే సినిమా మహేష్‌దే అవుతుందని తెలుస్తోంది.

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో మహేష్‌ని కొత్త యాంగిల్‌లో క్రిష్ ప్రెజెంట్ చేయనున్నారని వినికిడి. మహేష్ కెరీర్‌లోనే కాక క్రిష్ కెరీర్‌లో కూడా ఈ సినిమా ఓ మెమరబుల్ మూవీగా నిలిచిపోతుందని ఫిలింనగర్ వర్గాల భోగట్టా. ఇంకా సుకుమార్ దర్శకత్వంలో కూడా మహేశ్ నటించనున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

dookudu dresses for auction

‘‘వరుస పరాజయాలతో డీలా పడ్డ తెలుగు సినిమాకు ఊపిరులూదిన చిత్రం ‘దూకుడు’. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలో కూడా ఒక ప్రభంజనంలా దూసుకుపోతోందీ సినిమా. వసూళ్ల విషయంలో ‘మగధీర’ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. ఎనభై కోట్ల వసూళ్ల అంచనాలు దాటి వంద కోట్ల అంచనాలకు చేరుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సినిమా మహేష్ ఇమేజ్‌ని ఏ స్థాయికి తీసుకెళ్లిందంటే... ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా యాభై మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేష్ నిలిచాడు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ చెప్పారు.

‘దూకుడు’ చిత్రంలోని క్లయిమాక్స్ సాంగ్‌లో మహేష్, సమంత ధరించిన దుస్తులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) వేలానికి పెట్టింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీమోహన్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘‘గతంలో విజయం సాధించిన కొన్ని సినిమాల్లోని వస్తువులను పేద కళాకారుల సహాయార్థం వేలం వేయడం జరిగింది.

ఇప్పుడు ‘దూకుడు’లో మహేష్, సమంత ధరించిన దుస్తులను వేలం వేస్తున్నాం. ఈ నెల 25 లోగా ఎవరైతే ఎక్కువ ధరకి ఈ దుస్తులను వేలం పాడతారో వారికి మహేష్ చేతులమీదుగా వాటిని అందజేస్తాం’’ అని తెలిపారు. ఇంకా శ్రీనువైట్ల, ‘మా’ సంయుక్త కార్యదర్శి మహర్షి, ‘మా’స్టార్స్ డాట్ కామ్ శేఖర్, మా సభ్యులు జయలక్ష్మి, మాణిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Puri Khaidi with Mahesh Babu

 ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రమే చిరంజీవిను స్టార్ హీరోని చేసింది. కోదండరామిడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి అందరికి తెలిసిందే. ఇక తాజాగా ఈ మైల్‌స్టోన్ చిత్రాన్ని యువ కథానాయకుడు మహేష్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ రీమేక్ చేయనున్నాడని తెలిసింది.

ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరిచాడు. ‘ మహేష్, పూరీ కాంబినేషన్‌లో చిరంజీవి ‘ఖైదీ’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారనే గొప్ప న్యూస్‌ను నేను విన్నాను. జగన్ చెప్పిన మహేష్ పాత్రతో కంపేర్ చేస్తే కోదండరామిడ్డి డిజైన్ చేసిన చిరంజీవి పాత్ర నథింగ్’ అంటూ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరచడం విశేషం. ఇక ఈ వార్త తెలుగు సినీ పరిక్షిశమలో తప్పకుండా హాట్‌టాపిక్‌గా మారుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Dhookudu Success Meet With Mahesh


‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ చిత్రంతో 75 సంవత్సరాల సినీ చరివూతను తిరగరాసిన ప్రముఖ యువ కథానాయకుడు మహేష్‌బాబు ఈ సారి ‘దూకుడు’గా వచ్చి 80 ఏళ్ళ తెలుగు సినీ చరివూతలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ‘దూకుడు’ సూపర్‌హిట్ అనే విషయాన్ని మైండ్‌లో ఫిక్స్ చేసుకొని దర్శకుడు శ్రీనువైట్ల ప్రతిభను బ్లెండ్‌గా నమ్మి వెళ్ళిన ఈ క్రేజీ కథానాయకుడి ‘దూకుడు’ సినిమాని ఇప్పుడు దునియా మొత్తం కనులపండువగా చూస్తుంటే దిల్‌ఖుష్‌గా వున్నాడు మహేష్. ఒకవైపు ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా వుంటూనే మరోవైపు ‘దూకుడు’ విజయాన్ని ఆస్వాదిస్తున్న మహేష్ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు’ ఈ వేడుకకు సూపర్‌స్టార్ కృష్ణదంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేకార్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు పాత్రికేయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు... ఆ విశేషాలు మీకోసం.

‘దూకుడు’ ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందని ముందుగా ఊహించారా?
‘దూకుడు’ షూటింగ్ మొదటి రోజు నుంచే ఓ సూపర్‌హిట్ సినిమా చేస్తున్నాననే ఫీల్ కలిగింది. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని అందరికీ నమ్మకముండేది. కానీ ఈ స్థాయిలో సక్సెస్‌ను ఎవ్వరూ ఊహించలేదు. నేను ఈ సినిమా ఆడియో వేడుకలో చెప్పినట్లుగా నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోనుంది. ట్రేడ్ వర్గాలు కూడా ఈ చిత్రానికి వంద కోట్లు వసూళ్లు చేయగల సత్తా వుందని విశ్లేషిస్తున్నారు. సినిమా విడుదలైన దగ్గరినుంచి ‘ది బిజినెస్‌మేన్’ షూటింగ్‌లో వుండటం వల్ల సినిమా సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను.

ఇందులో నాలుగు వేరియేషన్స్ వున్న పాత్రల్ని చేశారు. షూటింగ్ సమయంలో ఎలా ఫీలయ్యారు?
నా కెరీర్‌లో ఇప్పటి వరకూ ఇన్ని షేడ్స్ వున్న పాత్రను చేయలేదు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రతీకార నేపథ్యమున్న కథాంశానికి వినోదాన్ని మేళవించి శ్రీనువైట్ల అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందులో ఏ పాత్ర కష్టమనిపించలేదు. కొంచెం సర్దుబాటు కావడానికి రెండు మూడు రోజులు పట్టిందంతే!. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో శ్రీనువైట్ల చాలా క్లారిటీతో వున్నాడు. సో..సినిమా మొత్తం ఆయన చెప్పినట్లు ఫాలో అయిపోయాను. నిజం చెప్పాలంటే షూటింగ్ ఆద్యంతం చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్ వున్న పాత్రలు చేశాను కాబట్టి మున్ముందు ఎలాంటి పాత్రనైనా పెద్దగా కష్టపడకుండా చేయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చింది.

ముఖ్యంగా ఎమ్.ఎల్.ఎ పాత్రలో కొత్తగా కన్పించారంటున్నారు?
స్క్రిప్ట్ విన్నప్పుడే ఈ పాత్ర సినిమాకి హైలైట్ అవుతుందని ఊహించాను. ఎందుకంటే గతంలో నేనెప్పుడు అలాంటి పాత్ర చేయలేదు. అందులో నా ఆహార్యం, మేనరిజమ్స్ అన్ని ప్రత్యేకంగా ఫక్తు రాజకీయ నాయకుడిలా వున్నాయంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘దూకుడు’లో నాది బెస్ట్ లుక్ అంటున్నారందరూ.

ఈ సినిమా సక్సెస్‌పై నాన్నగారి స్పందన ఎలా వుంది?
సినిమా విడుదలైన రోజు నేను, శ్రీనువైట్ల కారు ప్రయాణంలో వున్నప్పుడు నాన్నగారు ఫోన్ చేశారు. సినిమా 80 కోట్లు వసూళ్లు చేస్తుందని ధీమాగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ‘దూకుడు’ భారీ వసూళ్లు చేస్తోంది. ఆయన ఫోన్ చేసి అభినందించడమే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను.

‘దూకుడు’ చిత్రాన్ని మీ కెరీర్‌లో ఏ విధంగా ప్రత్యేకమైనదిగా భావిస్తారు?
‘పోకిరి’ తర్వాత నేను ఏ సినిమా చేసినా అందరూ దానితో పోల్చేవారు. ‘దూకుడు’ ఆ ఇమేజ్ నుంచి నన్ను బయట పడేసింది. అంతేకాదు రికార్డుల పరంగా కూడా ‘దూకుడు’ పోకిరిని అధిగమించింది.

భవిష్యత్తులో ప్రయోగాలకు ఆస్కారమున్న సబ్జెక్ట్‌లు చేస్తారా?
చేయను. కమర్షియల్ వాల్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ వున్న సినిమాలే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఉద్దేశ్యం లేదు.

ఈ సినిమా గురించి ఇండస్ట్రీ స్పందన ఎలా వుంది?
పూరి జగన్నాథ్ ఫోన్ చేసి నీ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశానని ప్రశంసించారు. రాజమౌళి కూడా సూపర్‌హిట్ మూవీ చేశావన్నారు.

‘ది బిజినెస్‌మేన్’ ఎంతవరకు వచ్చింది?
ప్రస్తుతం ముంబయ్‌లో షూటింగ్ జరుగుతోంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో తయారువుతున్న సై్టలిష్ మూవీ అది. దాదాపు యాభైశాతం పూర్తయింది. జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

ఈ సినిమాకి ఓవర్సీస్‌లో వస్తోన్న స్పందన పట్ల ఎలా ఫీలవుతున్నారు?
‘తీ ఇడియట్స్’ తర్వాత ఓవర్సీస్‌లో ఆ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న చిత్రమిదని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. అమెరికాలో ప్రముఖ పత్రిక లాస్ ఏంజిల్స్ టైమ్స్ ‘దూకుడు’ చిత్రంపై ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. ఇంతవరకూ ఏ భారతీయ సినిమా గురించి ఆ పత్రిక రాయలేదు. నిజంగా ఇది తెలుగువారందరూ గర్వించాల్సివ విషయం. ఓవర్సీస్‌లో ఒక్క వీకెండ్‌లోనే రెండు మిలియన్‌లు వసూళ్లు చేసింది. నైజాం కలెక్షన్లకు సమానంగా విదేశాల్లో వసూళ్లు చేసింది.

వెంక చేస్తోన్న ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఎలా వుంటుంది?
ఆ సినిమాలో పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. వెంక నాకు ఎప్పటినుంచే ఆత్మీయ అనుబంధం వుంది. ఈ చిత్రంలో ఇద్దరం అన్నాదమ్ముల్లుగా నటిస్తున్నాం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చి ఈ సినిమాలో నటిస్తున్నాను.

మీ తదుపరి చిత్రాలు?
‘ది బిజినెస్‌మేన్’ జనవరిలో విడుదలవుతుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ త్వరలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించే మరో చిత్రంలో నటించాల్సివుంది.

Mahesh is about his future projects


తెలుగు సినిమాకి వసూళ్ల పండగ తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్‌బాబు. 'దూకుడు' సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపారు. ''చిత్రాన్ని ఆదరిస్తున్న తీరు చాలా సంతృప్తినిస్తోంది. ప్రేక్షకుల ప్రతిస్పందనను ప్రత్యక్షంగా చూడాలనిపిస్తోంది. కానీ 'బిజినెస్‌ మేన్‌' చిత్రీకరణ కోసం ముంబై వెళ్లాల్సొచ్చింది. ఇకపై కూడా ఇలాగే అందరూ మెచ్చే సినిమాల్లో నటించాలని ఉంద''ని చెబుతున్న మహేష్‌బాబు ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
''ఒక సినిమాలో ఒకే రకమైన పాత్ర పోషిస్తే ఇమేజ్‌ సమస్యలు ఎదురవుతాయి. ఆ ప్రభావం తరువాతి సినిమాలపై కూడా పడుతుంటుంది. 'పోకిరి' విషయంలో నాకదే జరిగింది. 'దూకుడు' సినిమా ఇమేజ్‌కి దూరంగా నడిచింది. అందరికీ చేరే కథతో తెరకెక్కింది. ప్రారంభ సన్నివేశం నుంచి చివరి వరకూ వినోదమే ప్రధానంగా సాగుతుంది. ఇలాంటి కథల్లో నటించటం చాలా కష్టం. పైగా ఈ తరహా స్క్రిప్ట్‌లు అరుదుగా వస్తుంటాయి''.నాన్నతో...: ''ఎమ్మెల్యే పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. అందులోని హావభావాలు, ఆ వేషం కొత్తగా అనిపించింది. రాజకీయాలకీ దీనికి సంబంధం లేదు కానీ.. ఆ పాత్ర తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలను పండించేందుకు చక్కగా ఉపయోగపడింది. నిజ జీవితంలో అందరిలాగే నాకూ నాన్నతో అనుబంధమెక్కువ.నాన్నతో ఎప్పుడూ క్లోజ్‌గా ఉంటాన్నేను. నాన్నతో నటించాలని ఉంది. అందుకు తగ్గ కథ దొరకాలి. శ్రీను వైట్లతో మరిన్ని సినిమాలు చెయ్యాలని ఉంది. నా సినిమాలకి మణిశర్మ సంగీతం అందిస్తుంటారు. ఈసారి తమన్‌ని ఎంచుకొన్నాం. తను చక్కటి పని తీరు కనబరిచాడు. సమష్టి కృషితో కూడిన చిత్రమిది. అందుకు తగ్గట్టుగానే ఫలితాలొచ్చాయి''.
ఇంత డబ్బుందా?: ''ఒక నటుడిగా ఎన్నో విషయాలను నేర్పించిందీ చిత్రం. ఏ సినిమాలోనూ ఇంత అందంగా కనిపించలేదని చెబుతుండటం సంతోషాన్నిస్తోంది. నా సినిమాతో పరిశ్రమకు ఇంత పెద్ద విజయం దక్కటం చాలా ఆనందంగా ఉంది. విదేశాల్లో తొలి రెండు రోజుల వసూళ్లు చూసి నాకే ఆశ్చర్యమేసింది. వసూళ్లను చూస్తుంటే మాకే నమ్మశక్యంగా అనిపించలేదు. ఇంత డబ్బు ఎక్కడుందని ఆశ్చర్యమేసింది''.
్రపయోగాలు వద్దు: ''ప్రయోగాలు చేయడం నాకు ఏ మాత్రం ఇష్టముండదు. అందరికీ వినోదాన్ని పంచే మంచి సినిమాలకే నా ప్రాధాన్యం. కౌబాయ్‌ సినిమాలు చేసే ఆలోచన ఇప్పట్లో ఏ మాత్రం లేదు. ప్రస్తుతం 'బిజినెస్‌ మేన్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నాను. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అందులోని పాత్ర గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను. ముందుగా అనుకొన్నట్టే జనవరి 12న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది''.
అన్నదమ్ములుగా: ''సంతోష్‌శివన్‌తో సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. హిందీకి వెళ్లే ఆలోచన లేదు. తెలుగులో చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. జనవరి నుంచి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' సెట్స్‌పైకి వెళుతుంది. అందులో వెంకటేష్‌గారితో కలిసి నటిస్తుండటం ఆనందాన్నిస్తోంది. ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది. మల్టీస్టారర్‌ సినిమా అని కాదు కానీ కథ నచ్చింది. అందులో అన్నదమ్ములుగా నటిస్తున్నాం. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం''.

Dookudu Success Interview With Mahesh

మహేష్‌బాబు మంచి దూకుడు మీద ఉన్నారు. ‘దూకుడు’ సంచలన విజయం ఆయనలో నూతనోత్తేజాన్ని రగిల్చింది. చాలా రోజుల తర్వాత ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో మహేష్ సందడి చేశారు. ముంబయిలో ‘ద బిజినెస్‌మ్యాన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న మహేష్, ఈ సక్సెస్ మీట్ కోసమే హైదరాబాద్ వచ్చారు. ‘దూకుడు’ విజయం గురించి సూపర్‌స్టార్ కృష్ణ భావోద్వేగంగా ప్రసంగిస్తుంటే మెరిసే కళ్లతో తండ్రి సంతోషాన్ని తనివితీరా ఆస్వాదించారు. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభూతుల్ని పంచుకున్నారు మహేష్.

ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
ఇంకా పూర్తిగా ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది యూనివర్శల్ స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బెస్ట్ స్క్రిప్ట్‌గా చెప్పగలుగుతాను. అన్ని ఎమోషన్లు పలికించడానికి ఈ కేరక్టర్ నాకు అవకాశం కల్పించింది.

ఒక్క పాత్రలో అన్ని ఎమోషన్లు పలికించడం కష్టం అనిపించలేదా?
అనిపించలేదు. నాకిది నచ్చిన కథ. దాంతో ఇష్టంగా చేశాను. మొదటి మూడురోజులు మీరన్నట్లు కాస్త కష్టం అనిపించినా తర్వాత ఎంజాయ్ చేస్తూ ఈ కేరక్టర్ చేశాను. తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఒకపక్క, పోలీసుగా ఒకపక్క, ఎంటర్‌టైన్‌మెంట్ వేలో మరో పక్క... ఇలా విభిన్నమైన యాంగిల్స్ ఉన్నాయి ఆ పాత్రలో. ఒక విషయంలో మాత్రం ‘దూకుడు’ నాకు చాలా హెల్ప్ చేసింది. మొన్నటిదాకా ‘పోకిరి’ చట్రంలో ఇరుక్కుపోయాన్నేను. ఆ ఇమేజ్ నుంచి బయటపడేసిన చిత్రం ‘దూకుడు’. ‘పోకిరి’ రికార్డుని బ్రేక్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఒక్క పాత్రలో ఇన్ని షేడ్స్ పోషించాను కాబట్టి.. ఇక ఎలాంటి పాత్ర అయినా పోషించగలనన్న నమ్మకం నాకు ‘దూకుడు’ కలిగించింది.

మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?
నాన్నగారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడమే బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన 80 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. పూరి జగన్నాథ్ అయితే బ్రహ్మానందంకి ధీటుగా కామెడీ చేశావన్నాడు. అలాగే రాజమౌళి కూడా. ఇంతమంది కాంప్లిమెంట్లు పొందడం చాలా ఆనందంగా ఉంది.

సినిమాలో మీ పాత్ర కాకుండా మీకు నచ్చిన మరో పాత్ర ఏమిటి?
ప్రకాష్‌రాజ్ కేరక్టర్. శ్రీను వైట్ల దాన్ని చాలా కొత్తగా డిజైన్ చేశాడు.

ఫస్ట్ టైమ్‌లో ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
కొత్తగా ఉంది. సినిమాకి హైలైట్ అవుతుందని అందరం అనుకున్నాం. నా మెడలో పులిగోరు, వైట్ అండ్ వైట్ డ్రస్ అందరికీ నచ్చింది. నాక్కూడా బాగా నచ్చింది.

విదేశాల్లో కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడంపట్ల మీ ఫీలింగ్?
‘3 ఇడియట్స్’ ఓవర్‌సీస్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. నంబర్ 2 ప్లేస్‌లో ‘దూకుడు’ ఉంది. పది కోట్లకు పైనే అక్కడ వసూలు చేసింది ఈ సినిమా. మన దగ్గర నైజాం కలెక్షన్లతో సమానంగా ఓవర్‌సీస్‌లో వసూలు చేసింది. మన తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కేరక్టరైజేషన్ ఎలా ఉంటుంది?
కేరక్టరైజేషన్ గురించి ఇప్పుడే చెప్పకూడదు. అయితే వెంకటేష్‌గారితో చేయడం మాత్రం ఆనందంగా ఉంది. ఆయనది ఫ్రెండ్లీ నేచర్. ఇందులో మేమిద్దరం అన్నదమ్ములుగా నటిస్తున్నాం. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. రేపు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.

Dookudu Becoming Industry Biggest Hit

''పోకిరి సినిమా చూశాక 'ఈ సినిమా రూ.40 కోట్లు వసూలు చేస్తుందని చెప్పా. నేను చెప్పినట్టుగానే ఆ సినిమా బాగా ఆడింది. 'దూకుడు' చూశాక రూ.80 కోట్లు రాబట్టుకొంటుందని చెప్పాను. ఆ సంఖ్య వంద కోట్ల మార్కుకి చేరుకొనేలా ఉంద''న్నారు కృష్ణ. ఆయన తనయుడు మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా బాగా ఆడడానికి చాలా కారణాలున్నాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా తీర్చిదిద్దారు. దర్శకత్వం, సంభాషణలు, పాటలు అన్నీ బాగున్నాయి. థియేటర్‌కి వచ్చినవాళ్లు శుభం కార్డు వరకూ నవ్వుతూనే ఉన్నారు. మహేష్‌ చాలా అందంగా కనిపించాడ''ని చెప్పారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''దూకుడు సినిమా ఈ స్థాయిలో ఆడడానికి కారణం శ్రీను వైట్ల. ఈ కథ చెబుతున్నప్పుడు ఓ మాట అన్నారు.. 'సూపర్‌ హిట్‌ తీస్తా. లేదంటే బ్లాక్‌బస్టర్‌ సినిమా తీస్తా'. అవి రెండూ కాదు.. పరిశ్రమ రికార్డులు తిరగరాసే సినిమా తీశాడు. అతనికి మంచి నిర్మాతలు దొరికారు. సమంతలాంటి కథానాయికని నేనింత వరకూ చూళ్లేదు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకొంటామనే నమ్మకం ఉంద''న్నారు. ''నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. మహేష్‌ అంటే నాకు చాలా ఇష్టం. వీరిద్దరుకలిసి ఇంత మంచి చిత్రం తీయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం విజయానికి మహేష్‌బాబు నటనే కారణం'' అన్నారు దర్శకుడు. ''దమ్మున్న కథానాయకుడు, సత్తా ఉన్న దర్శకుడు కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సినిమానే సాక్ష్యం'' అన్నారు నిర్మాతలు రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట. కథానాయిక సమంత మాట్లాడుతూ ''దూకుడు ద్వారా గొప్ప విజయాన్ని పొందడం నా అదృష్టం. ఈ చిత్రంతో నటిగా కొత్త విషయాలెన్నో తెలుసుకోగలిగాను'' అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల, జి.ఆదిశేషగిరిరావు, డి.సురేష్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ఱ, కె.ఎస్‌.రామారావు, రూప వైట్ల, కోట శ్రీనివాసరావు, తమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Mahesh Bussiness Man Title Song Shooting at Delhi

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. కాజల్‌ నాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అందులో కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''మహేష్‌బాబు శైలికి తగ్గ కథాంశమిది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగుతుంది. 'పోకిరి' బృందం నుంచి వస్తున్న చిత్రమిది. ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను అందుకొనేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. మహేష్‌ పాత్ర, ఆయన పలికే హావభావాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ''న్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదికొస్తుంది. ప్రకాష్‌రాజ్‌, సాయాజీషిండే, నాజర్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: తమన్‌.

Seethamma Vakitlo Sirimalle Chettu

తెలుగు సినిమాల్లో మల్టీస్టారర్‌ అనేది ఓ కల. ఇద్దరు కథానాయకులు కలిసి తెరమీద సందడి చేస్తే చూడాలని సగటు సినీ అభిమాని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణ ఫలించింది. ఇద్దరు ప్రముఖ కథానాయకులు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రమే... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్‌, మహేష్‌బాబు కథానాయకులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కొత్తబంగారులోకం' చూపించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ఉదయం విజయదశమి పర్వదినాన లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చారు. వి.వి.వినాయక్‌ స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి చేతుల మీదుగా శ్రీకాంత్‌ అడ్డాల స్క్రిప్టు అందుకొన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ''వసుధైక కుటుంబం మన భారతదేశం. ఈ దేశాన్ని సీతమ్మ వాకిలి అనుకొంటే.. అందులో అందమైన సిరిమల్లె చెట్టు మన కుటుంబ వ్యవస్థ. ఈ బంధానికి సంబంధించిన కథ ఇది. అందుకే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే పేరు పెట్టాం. అందరికీ నచ్చిన పేరిది. శ్రీకాంత్‌ ముందునుంచీ 'ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు ఉండాల్సిందే' అని అంటున్నాడు. అది ఎంత కష్టమో మనకు తెలుసు. ఈ కథకు వెంకటేష్‌ ఎప్పుడో తన అంగీకారం తెలిపారు. మరో కథానాయకుడు కావాలి. ఓ రోజు 'దూకుడు' సెట్లో మహేష్‌బాబుకి ఈ కథ వినిపించాం. వెంటనే ఆయన కూడా ఒప్పుకొన్నారు. అలా మా సినిమా మొదలైంది. ఇది ప్రత్యేకించి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తీస్తున్న సినిమా కాదు. ప్రతి ఒక్కరికీ నచ్చేలా తీర్చిదిద్దుతాం. మిగతా నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు ట్వరలోనే చెబుతాం. నవంబరులో చిత్రీకరణ మొదలుపెడతాం. వేసవికి విడుదల చేస్తామ''న్నారు. ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, బూరుగుపల్లి శివరామకృష్ణ, శ్యాంప్రసాద్‌రెడ్డి, వంశీపైడిపల్లి తదితరులు పాల్గొన్నారు.

‘సీతమ్మ వాకిట్లో...’ సూపర్‌స్టార్స్

అందరి దృష్టినీ తమవేపు నిలుపుకునే అసలు సిసలైన మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సాక్షిగా ప్రేక్షకుల మనసుల్లో మరుమల్లెలు పూయించడానికి ఇద్దరు అగ్రహీరోలు- వెంకటేష్, మహేష్ రెడీ అయ్యారు. ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన క్రెడిట్ సంచనల చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజుకు దక్కుతుంది.

సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రేక్షకులను ‘కొత్తబంగారులోకం’లో విహరింపజేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. అపురూప కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ అన్న పేరును పెట్టి, తొలి అడుగులోనే అభినందనలు అందుకుంటున్నారాయన. ఇద్దరు నాయికలు వుండే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంత నటించనున్నట్టు సమాచారం.

‘దూకుడు’లో మహేష్‌బాబు సరసన చేసిన సమంత ఇందులో రెండోసారి ఆయన సరసన జతకడుతున్నట్టు వినికిడి. ‘దిల్’రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం దసరారోజు అయిన ఈ నెల 6న నిర్వహించనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులకు నిజంగా ‘డబుల్ ధమాకా’నే అని చెప్పొచ్చు.

రికార్డు కలెక్షన్ల ‘దుకుడు’

మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ‘దూకుడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాతలు సినిమాకి వస్తోన్న కలెక్షన్ల వివరాలు తెలియజేస్తూ ‘మొదటి వారం రోజుల్లోనే 50 కోట్ల 7లక్షలకుపైగా గ్రాస్, 35 కోట్ల 1లక్ష షేర్ సాధించి ఎనభై సంవత్సరాల తెలుగు చలన చిత్ర రికార్డును తిరగరాసింది.



నైజాంలో మొదటివారం 12 కోట్ల 51లక్షలు, ఆంధ్రలో 13 కోట్ల 10లక్షలు, సీడెడ్‌లో 6కోట్ల 30 లక్షలు, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, ఉత్తర భారతదేశంలో 6 కోట్ల 50 లక్షలకు పైగా వసూళ్లను సాధించింది. విదేశాల్లో 11 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ‘దూకుడు’ చిత్ర విజయంపై పత్రికల్లో ప్రత్యేక కథనాలు వెలువడడం చూస్తుంటే మా చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలుస్తోంది’ అన్నారు.

శ్రీను వైట్ల మాటల్లో మహేష్‌బాబు

సాధారణంగా ప్రతి సినిమాలో కథానాయకుడు ఒక్కడే ఉంటాడు. కథంతా అతని చుట్టే తిరుగుతుంది కాబట్టి... థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడి దృష్టి అతని మీదే ఉంటుంది. శ్రీను వైట్ల సినిమాలకు వెళ్లేటప్పుడు ఈ అభిప్రాయాన్ని చెరిపేసుకోవచ్చు. ఎందుకంటే... సన్నివేశం ఓ హీరోలా కనిపిస్తుంది. అందులో కనిపించే ప్రతీ పాత్రా వినోదం పండించడానికి పోటీపడుతుంది. ఓ వైపు కథానాయకుడు ఆటాడించేస్తూనే ఉంటాడు. ఎక్కడా మాస్‌, యాక్షన్‌ తగ్గనీయడు. మరో వైపు మెక్‌డొనాల్డ్‌ మూర్తో, చికాగో సుబ్బారావో, బొక్కా వెంకట్రావో... చక్కిలిగింతలు పెట్టేస్తుంటాడు. తాజాగా మహేష్‌బాబు 'దూకుడు'ని తన శైలిలో చూపించి వినోదం పంచారు శ్రీను వైట్ల. ఈ సందర్భంగా ఆయనతో ఈనాడు సినిమా ప్రత్యేకంగా సంభాషించింది.

'దూకుడు' ఫలితం ఎలాంటి అనుభూతినిచ్చింది?
'దూకుడు' విడుదలైన మరునాడే నా పుట్టిన రోజు. ఘన విజయంతో తెలుగు ప్రేక్షకులు నాకు మరచిపోలేని బహుమతిని అందించారు. మూడు రోజుల్లోనే వసూళ్లపరంగా ఎన్నో రికార్డులు సాధించింది 'దూకుడు'. విదేశాల్లోనూ చక్కటి ఆదరణ పొందుతోంది. తరణ్‌ ఆదర్శ్‌లాంటి బాలీవుడ్‌ మార్కెట్‌ విశ్లేషకులు సైతం 'దూకుడు' హిందీ సినిమాలతో పోటీపడి విదేశాల్లో వసూళ్లు దక్కించుకొందని ట్విట్టర్‌లో రాశారు. ఇంతటి విజయాన్ని సాధించడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది.
మహేష్‌బాబుతో సినిమా అనగానే మీకేమనిపించింది?
చాలా రోజులుగా మహేష్‌బాబుతో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్నా. ఆ అవకాశం నాకు దొరికింది. ఎలాగైనా ఒక మంచి సినిమా తియ్యాలని మనసులో బలంగా అనుకొన్నాను. మహేష్‌కి నేను అనుకొన్న ఓ కథ చెప్పాను. ఆయన బాగుందనీ అన్నారు. ఎనభై శాతం స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి చేశాం. ఇక షూటింగ్‌కి వెళ్లడమే ఆలస్యం అనుకొన్న తరుణంలో ఓ రోజు రాత్రి ఈ కథను మార్చాలని అనిపించింది నాకు. మహేష్‌తో ఘన విజయం ఇచ్చే కథ ఇలా ఉండకూడదనే భావన కలిగింది. ఇంకో మంచి కథ తీసుకొస్తానని మహేష్‌కి చెప్పి వచ్చాను. కానీ... ఏం చేయాలీ? ఎలాంటి కథ చేయాలీ అనే ఒత్తిడి మొదలైంది. ఎలాగైనా మహేష్‌ని కొత్తగా చూపించాలని తీవ్రంగా ఆలోచించా. అప్పుడు తట్టిన ఆలోచనే యువ ఎమ్మెల్యే పాత్ర. అక్కడ మొదలుపెట్టి అల్లుకొన్న కథే ఇది.
ఐపీఎస్‌ పాత్రకు, ఎమ్మెల్యేకీ ముడి వేసేశారు..?
ఈ ఆలోచనతోపాటు తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, భావోద్వేగాల గురించి మా రచయిత గోపీమోహన్‌కి చెప్పాను. చాలా బాగుందని చెప్పాడు తను. ఏడు నెలలు అహర్నిశలు కష్టపడి ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. ఈ కథ విన్నాక మహేష్‌బాబు 'ఫెంటాస్టిక్‌, మైండ్‌ బ్లోయింగ్‌, అన్‌బిలీవబుల్‌' అనేశారు. ఆ మాటల్నే ఈ సినిమాలో వాడుకొన్నాం. కోన వెంకట్‌ సంభాషణలు, గుహన్‌ ఛాయాగ్రహణం, తమన్‌ సంగీతం మాకు కలిసొచ్చాయి. నిర్మాతలు నా మిత్రులు కావడంతో ఎంతో సహకరించారు.
మహేష్‌బాబు ఒక మాస్‌ కథానాయకుడు. వినోదానికి ప్రాధాన్యమిచ్చే దర్శకులు మీరు. ఈ కథ అనుకొన్నప్పుడు ఇద్దరి శైలికీ వ్యత్యాసముందని అనిపించలేదా?
కొన్నేళ్లుగా మహేష్‌బాబు శైలిని ప్రత్యేకంగా గమనిస్తున్నాను. తెరపై వినోదాన్ని పండించడంలో ఆయన సత్తా ఏమిటో నాకు తెలుసు. పైగా ఈ కథలో హీరో పాత్ర పలు కోణాల్లో కనిపిస్తుంది. ఇది వరకు ఎవ్వరూ కూడా మహేష్‌ని అన్ని కోణాల్లో చూపించకపోవటం మాకు కలిసొచ్చింది. అన్ని విషయాలు సమపాళ్లల్లో కుదరటంతో ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకెళ్లాం. మా ప్రయత్నం చక్కటి ఫలితాన్నివ్వటం ఆనందాన్నిస్తోంది.
ఈ సినిమాలో భావోద్వేగాల పాళ్లు కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి...
తెలుగులో గొప్ప విజయాన్ని సాధించిన సినిమాలను తీసుకొంటే అందులో వినోదం, భావోద్వేగాలు, ఉత్కంఠ.. ఈ మూడు సమపాళ్లల్లో ఉంటాయి. అప్పుడే మన ప్రేక్షకులకు చేరువవుతుంది సినిమా. అందుకే నవరసాల్లో నేను కరుణ రసానికీ తగిన ప్రాధాన్యమిస్తాను. నా సినిమాలు పరిశీలిస్తే కుటుంబ వాతావరణం తప్పకుండా ఉంటుంది. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథ కాబట్టే 'దూకుడు' సెంటిమెంట్‌ కూడా బాగా పండింది.
నటుడిగా కాదు... వ్యక్తిగతంగా మహేష్‌బాబుపై మీ అభిప్రాయం ఏమిటి?
ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది. కానీ మహేష్‌ విషయంలో అది విరుద్ధంగా జరుగుతోంది. ఆయన అలా ఉండటానికి ఓ కారణం ఉంది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉంటారాయన. ఆయన నవ్వడానికి ఒక చిన్న కారణం కావాలంతే. మహేష్‌ అందం మాకు కొన్ని సంభాషణలు రాసుకొనేందుకూ పనికొచ్చింది.
తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిపై సర్వహక్కులు కథానాయకుడికే ఉంటాయి. కానీ ఈ సినిమా పతాక సన్నివేశాలను అందుకు భిన్నంగా చూపించడానికి కారణమేమిటి?
ఈ కథ ప్రత్యేకతే అది. 'దూకుడు' విజయానికి ప్రధానమైన ఓ కారణం కూడా పతాక సన్నివేశాలే. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పతాక సన్నివేశాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎక్కడా కూడా రక్తపాతంతో కూడిన సన్నివేశాలు లేకపోవటంతో అన్ని వయసుల ప్రేక్షకులు ఆనందంగా చూస్తున్నారు.
మీ సినిమాలంటే తెర నిండా పాత్రలు, అడుగడుగునా మలుపులు తప్పనిసరిగా ఉండాల్సిందేనా?
నిజం చెప్పాలంటే... నాలుగైదు పాత్రలతో నేను సినిమా తియ్యలేను. సెట్‌కి వెళితే నాకు సందడి కనిపించాలి. మొదట్నుంచీ అలాగే అలవాటైంది. అయితే ఈ తరహా కథలను తెరపైకి తీసుకురావటంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం తూకం చెడినా ఫలితాలు మారిపోతాయి. ఇది కష్టమైన పనైనా నేను చాలా ఇష్టంగా చేస్తుంటాను.
రెఢీ, ఢీ... మీ సినిమాలు హిందీలోకి వెళ్తున్నాయి. మీరూ హిందీకి వెళ్లే ఆలోచనేమైనా ఉందా?
నా చిత్రాలు బాలీవుడ్‌కి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. హిందీలో టాప్‌ త్రీ సినిమాల్లో 'రెడీ' ఒకటిగా నిలిచింది. 'ఢీ' సినిమాకి దర్శకత్వం వహించమని అడిగారు. కానీ నాకు తీరిక లేకపోవటంతో ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు 'దూకుడు' సినిమాని హిందీలో తీయాలనే ఆలోచన ఉంది. సల్మాన్‌ఖాన్‌ అయితే దీనికి బాగుంటాడని అనుకొంటున్నా. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి.
తదుపరి చిత్రం ఎప్పుడు?
ప్రస్తుతం దూకుడు విజయానందంలో ఉన్నాను. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా సినిమా ఉంటుంది. అలాగే వచ్చే యేడాది మహేష్‌బాబుతో మరో చిత్రం చేస్తాను.

అభిమానుల మధ్య మహేష్‌బాబు 'దూకుడు'

హేష్‌బాబు 'దూకుడు'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలైన రోజునే ఆయన తన అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.
మహేష్‌, నమ్రత దంపతులు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌కి శుక్రవారం ఉదయం వచ్చారు. జి.ఆదిశేషగిరిరావు, శ్రీను వైట్ల, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట తదితరులు కథానాయకుడితో కలిసి చిత్రం చూశారు. మహేష్‌తమతో కలిసి చిత్రం చూడటంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఆయన అందరికీ అభివాదం చేశారు. అలాగే కృష్ణ, విజయనిర్మల సినీమాక్స్‌లో చిత్రం వీక్షించారు. ప్రదర్శన అనంతరం కృష్ణ మాట్లాడుతూ మహేష్‌ నటనను మెచ్చుకొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

దూకుడు

సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: మహేష్‌బాబు, సమంత, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్‌, సాయాజీషిండే, నాజర్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మాస్టర్‌ భరత్‌ తదితరులు
సంగీతం: తమన్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర
దర్శకత్వం: శ్రీను వైట్ల
విషయం: అజయ్‌(మహేష్‌బాబు)కి దూకుడెక్కువ. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకోవలసిందే. అలా తీసుకొన్న ఓ నిర్ణయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వృత్తి తరవాత ఎక్కువగా ఇష్టపడేది తన కుటుంబాన్ని. అతని జీవితంలోకి ప్రశాంతి (సమంత) ప్రవేశిస్తుంది. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీద చూసి తెలుసుకోవలసిందే.
విశేషాలు: నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రీకరణ ప్రధాన ఆకర్షణ. వృత్తిగత జీవితంలో అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఛేదించిన విధానం ఉత్కంఠపరుస్తాయి. ఆయన నటన అందరికీ నచ్చుతుంది. కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా తీర్చిదిద్దారు. బ్రహ్మానందం పాత్ర మరోసారి వినోదం పండిస్తుంద''న్నారు.
విడుదల: శుక్రవారం.

23న ‘దూకుడు’

మహేష్‌బాబు కథానాయకుడిగా 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘దూకుడు’ చిత్రం ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మా చిత్రానికి సెన్సార్ పూర్తికాలేదని, ఎప్పుడు విడుదలవుందో తెలియదనే ఊహాగానాలు వెలువడ్డాయి. వాటన్నింటిని మేము ఖండిస్తున్నాం. చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. ఒక్క నైజాంలోనే దాదాపు 200పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. తొలిసారిగా పైరసీని అరికట్టడానికి కోర్టు ద్వారా ‘జాన్ డో’ ఉత్తర్వులను పొందాము. దీని ప్రకారం మా చిత్ర విజువల్స్‌గానీ, ఆడియోగాని, ఏ రూపంలో అనగా డిజిటల్ ఫార్మెట్‌లోగాని ఆన్‌లైన్ అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ చేయడం నేరం. ఎవరైనా కోర్టువారి ఉత్తర్వులు ఉల్లంఘించి కాపీరైట్ చౌర్యానికి పాల్పడితే చట్టవూపకారం చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

ముంబయిలో 'బిజినెస్‌ మేన్‌'

హేష్‌బాబు - పూరి జగన్నాథ్‌... వీరి పేర్లు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం 'పోకిరి'. ఆ తరవాత వీరి నుంచి వస్తున్న చిత్రం 'బిజినెస్‌ మేన్‌'. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''మళ్లీ పోకిరి బృందం నుంచి ఓ సినిమా రావడం ఆనందంగా ఉంది. అన్ని వాణిజ్య అంశాలు మేళవించిన కథతో బిజినెస్‌ మేన్‌ సిద్ధమవుతోంద''న్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌ పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. త్వరలో హైదరాబాద్‌లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ''న్నారు నిర్మాత. వచ్చే యేడాది జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నారు. ప్రకాష్‌రాజ్‌, సాయాజీషిండే, నాజర్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: తమన్‌.

‘దూకుడు’లో స్టెప్స్ సూపర్బ్

‘‘టాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్‌లో ఒకటిగా రేపు ‘దూకుడు’ నిలువబోతోంది. పెర్‌ఫార్మెన్స్ పరంగా ఇందులో ఓ కొత్త సమంతాను చూస్తారు’’ అని ధీమాగా చెబుతున్నారు అందాలభామ సమంత. త్వరలో విడుదల కానున్న ‘దూకుడు’ సినిమా గురించి మాట్లాడుతూ సమంత పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి నేర్చుకున్నాను. తొలి సినిమా ‘ఏం మాయ చేసావె’లో డాన్స్‌లో నా నైపుణ్యాన్ని చూపించే అవకాశం రాలేదు.

ఇక రెండో సినిమా ‘బృందావనం’లో ఆ అవకాశం వచ్చినా... అది పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ‘దూకుడు’లో మాత్రం నా ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం కలిగింది. ఇందులో స్టెప్స్ సూపర్బ్‌గా ఉంటాయి. మహేష్ మార్క్ స్టైలిష్ డాన్సులతో పాటు, ఎన్నో వైరైటీ డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో చేసే అవకాశం దొరికింది నాకు.

డాన్సుల పరంగానే కాదు.. నటన పరంగా కూడా నాకు పూర్తిస్థాయి సంతృప్తినిచ్చిన సినిమా ‘దూకుడు’. నా కెరీర్‌లో ఓ మెమరబుల్ హిట్‌గా ఈ సినిమా నిలవడం ఖాయం’’ అని ఎంతో ఉద్వేగంతో చెప్పుకొచ్చారు సమంత.

ఓ వైపు ఆటో సుబ్బారావు..

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, పార్వతీమెల్టన్‌పై 'ఓ వైపు హాయ్‌ అంటాడు ఆటో సుబ్బారావు..' అనే గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈపాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈనెల 23న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం కలగలిపిన చిత్రమిది. 'మైండ్‌లో ఫిక్సయితే బ్త్లెండ్‌గా దూసుకుపోతా..' 'భయానికి మీనింగు తెలియని బ్లడ్‌రా నాది..' ఇలా మహేష్‌ పలికే సంభాషణలు అందరినీ ఆకట్టుకొంటాయి. మహేష్‌ అభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది. సమంత పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. తమన్‌ బాణీలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పోయ్‌..పోయ్‌ పాట మాస్‌కి బాగా నచ్చుతుంద''న్నారు.

మహేష్ మాస్ మసాలా ‘దూకుడు’

‘భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది’ అంటూ మహేష్ త్వరలో వెండితెర మీదికి ‘దూకుడు’గా రాబోతున్నాడు. ఆయన అభిమానులు ఆయన నుంచి ఎదురుచూస్తున్న మాస్ మసాలా వినోదాన్ని ఈ చిత్రం ద్వారా పంచబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని రీతిలో దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ను ‘దూకుడు’లో ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సమంత నాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కాబోతుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.రమేష్‌బాబు సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్, పార్వతీమెల్టన్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటలో పార్వతీ హాట్ హాట్‌గా కనిపించనుందని యూనిట్ వర్గాలు చెపుకుంటున్నాయి. ఇక ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానున్న దూకుడు గురించి నిర్మాతలు మాట్లాడుతూ ‘మహేష్ కెరీర్‌లో అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆయన నుంచి అభిమానులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా వుంటాయి. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అతి పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనుసూద్, సయాజీ షిండే, నాజర్, సంజయ్ తదితరులు ముఖ్యపావూతలు పోషిస్తున్నారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దిల్‌రాజు బేనరులో వెంకటేష్, మహేష్ నటిస్తున్న

ఇది ఏప్రిల్ ఫూల్ వార్త కాదు. ఇది నిజంగా నిజం. అగ్ర కథానాయకులు వెంకటేష్, మహేష్‌బాబు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఈ వార్త అతి త్వరలోనే నిజం కాబోతోంది. నిజమైన మల్టీస్టారర్‌కు నిర్వచనంగా నిలిచే ఈ చిత్రం టైటిల్ కూడా సరికొత్త పంథాలో ఉండబోతోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసినట్టుగా సమాచారం.

వరుస విజయాల పరుసవేదిగా పేరు తెచ్చుకున్న ‘దిల్’రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2008లో ‘కొత్త బంగారులోకం’తో తన సృజనను చాటుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మూడేళ్లు శ్రమించి ఈ మల్టీస్టారర్ స్క్రిప్టును సిద్ధం చేశారు. కానీ, వెంకటేష్-పవన్‌కళ్యాణ్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి.

వెంకటేష్, మహేష్‌లకు స్క్రిప్టు నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపినట్టుగా సమాచారమ్. నవంబర్ నెలాఖరున కానీ, డిసెంబర్ మొదటి వారంలో కానీ చిత్రీకరణ మొదలు పెట్టడానికి దిల్‌రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా కనిపిస్తారనేది సమాచారం. ప్రకాశ్‌రాజ్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.

రామోజీ ఫిలింసిటీలో 'దూకుడు' గీతం

సరా బరిలో సందడి చేసేందుకు మహేష్‌బాబు సిద్ధమవుతున్నారు... 'దూకుడు' చిత్రంతో. ఆ సినిమాకి సంబంధించిన గీతాన్ని ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ని సిద్ధం చేశారు. మహేష్‌, సమంతలపై చిత్రిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తవుతాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 'దూకుడు' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర తెలిపారు. తమన్‌ స్వరపరచిన గీతాలు ఇటీవలే శ్రోతల ముందుకొచ్చాయి.

మహేష్ బిజినెస్ మొదలైంది

మహేష్, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ‘బిజినెస్ మేన్’ షూటింగ్ సెప్టెంబర్ 2న శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రారంభమైంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ‘ ‘పోకిరి’ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. మా ఇద్దరి కలయికలో అద్భుతమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. మా ఇద్దరి కలయికలో నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా పెద్ద సినిమా కాబోతోంది. ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలున్న స్క్రిస్ట్ ఇది’అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ‘ మహేష్‌తో ‘పోకిరి’ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇందులో మహేష్ పాత్ర చిత్రణ, ఆయన చెప్పే డైలాగ్స్ అద్భుతంగా వుంటాయి.ఎక్కడా రాజీపడకుండా నిర్మాత వెంకట్ చిత్రాన్ని చాలా చక్కగా నిర్మిస్తున్నారు’అని తెలిపారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ‘టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ నెల 10 వరకు హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ నెల 11 నుంచి డిసెంబర్ 25 వరకు ఒకే షెడ్యూల్లో ముంబాయి, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ జరుపుతాం.

జనవరి 12న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’అన్నారుపకాష్‌రాజ్, షాయాజీ షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్, కెమెరా: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, సహ నిర్మాత: వి. సురేష్ రెడ్డి, నిర్మాత: డా. వెంకట్, కథ-వూస్కీన్‌ప్లే- దర్శకత్వం: పూరి జగన్నాథ్

వచ్చేనెల 23న 'దూకుడు'

''ప్రేక్షకుల అంచనాలు అందుకొనేలా ఉంటుంది మా 'దూకుడు' చిత్రం. ఆ సినిమా విడుదలయ్యే రోజు కోసం అందరిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. సెప్టెంబరు 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. దర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''మహేష్‌ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. అందులో ఆయన పలికిన సంభాషణలు అందరికీ నచ్చుతాయి. 'కళ్లున్నోడు ముందు చూస్తాడు... దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు', 'భయానికి మీనింగే తెలియని బ్లడ్‌రా నాది...' లాంటి పదునైన మాటలున్నాయ''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్‌, సాయాజీ షిండే, నాజర్‌, సంజయ్‌ స్వరూప్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు, మాస్టర్‌ భరత్‌, చంద్రమోహన్‌ తదితరులు నటించారు. సమర్పణ: జి.రమేష్‌బాబు, సంగీతం: తమన్‌.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ‘దూకుడు’

‘ఇటీవల విడుదలైన ‘దూకుడు’ ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. థమన్ అందించిన సంగీతం వైవిధ్యమైన బాణీలతో ఆకట్టుకుంటోంది. మహేష్‌బాబు చిత్రాల్లోనే ది బెస్ట్ ఆడియో అని అందరూ అంటున్నారు. కళ్లున్నోడు ముందు చూస్తాడు. దిమాక్ వున్నోడు దునియాను చూస్తాడు...లాంటి డైలాగ్స్ ఎన్నో ‘దూకుడు’ చిత్రంలో మహేష్‌బాబు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి’ అన్నారు చిత్ర నిర్మాతలు గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ‘రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే వారిని అన్ని విధాలా సంతృప్తిపరిచే విధంగా ఈ చిత్రం వుంటుంది. కావాల్సినంత వినోదంతో పాటు రోమాంచితమైన యాక్షన్ వుంటుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి.

శ్రీనువైట్ల పంచ్‌డైలాగ్‌లకు మహేష్‌బాబు టైమింగ్ కుదిరితే ఎలా వుంటుందో ఈ చిత్రంలో చూస్తారు. శ్రీనువైట్ల, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తోన్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కన్నులపండువలా వుంటుంది. నిర్మాణపరంగా కూడా ఎక్కడా రాజీపడలేదు. పరిక్షిశమలో సమ్మెకారణంగా బడ్జెట్ కొంచెం ఎక్కువయింది’ అన్నారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, షాయాజీషిండే, నాజర్, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపావూతల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జి.రమేష్‌బాబు.

సెప్టెంబర్ ప్రథమార్ధంలో 'దూకుడు'

హేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. వచ్చేనెల ప్రథమార్ధంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ''తమన్‌ హుషారైన బాణీలను అందించారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటల్లో ఉన్న దూకుడు కథ, కథనాల్లోనూ కనిపిస్తుంది. మహేష్‌బాబు తరహా యాక్షన్‌ ఘట్టాలు, శ్రీను వైట్ల శైలి వినోదం కలగలిపిన చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్‌, సాయాజీ షిండే, నాజర్‌, తనికెళ్ల భరణి, చంద్రమోహన్‌, మాస్టర్‌ భరత్‌, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, రచన: గోపి మోహన్‌, కోన వెంకట్‌, సమర్పణ: జి.రమేష్‌బాబు.

మహేష్ సరసన హన్సిక ?

ముద్దుగుమ్మ హన్సిక మహేష్‌బాబు సరసన ‘ది బిజినెస్‌మేన్’లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్షికమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కాజల్ అగర్వాల్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కీలక పాత్రకు ఎంపికయినట్లు తెలిసింది. అయితే సెకండ్ హీరోయిన్ పాత్రలో అస్సలు నటించనని గతంలో ఈ భామ ప్రకటించడం విశేషం.

గత కొంతకాలంగా తెలుగులో సరైన సక్సెస్‌లు లేని హన్సిక ఇటీవల ‘కందిరీగ’ విజయంతో ఉత్సాహంగా వుంది. అంతేకాదు తమిళంలో విజయ్ సరసన ఈ సుందరి నటించిన ‘వేలాయుధం’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మహేష్‌బాబు సరసన నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న హన్సికను ఇక మంచి రోజులు వచ్చిన టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

దూకుడు రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నా : మహేష్

‘శ్రీను వైట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. దూకుడు షూటింగ్ ఒక పిక్నిక్‌లా సాగింది. షూటింగ్ జరిగిన 9నెలలు చాలా ఆనందంగా గడిపాను. శ్రీను వైట్ల నాన్న గారికి పెద్ద అభిమాని. ఆ అభిమానంతో ‘దూకుడు’ లాంటి మంచి సినిమా నాకు అందించినందుకు శ్రీను వైట్లకు జీవితాంతం రుణపడి వుంటాను’ అన్నారు మహేష్.మహేష్ మాట్లాడుతూ‘ ఈ ఆడియో ఫంక్షన్ చూస్తుంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌లా వుంది. మణిశర్మ దగ్గర థమన్ కీబోర్డ్ ప్లేయర్‌గా వున్నప్పటి నుంచి తెలుసు. థమన్ ‘దూకుడు’ సాంగ్స్ అదరగొట్టాడు. ఇంత వరకు ఇలాంటి నిర్మాతలతో వర్క్ చేయలేదు. ఎక్కడా రాజీపడకుండా చాలా చక్కగా చిత్రాన్ని నిర్మించారు. ‘దూకుడు’ విడుదల కోసం అందరి లాగే నేనూ ఎదురు చూస్తున్నా. వచ్చేనెల సినిమా విడుదల కాబోతోంది. ఆరోజు అభిమానులందరికీ పండగే’అన్నారు.

దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ‘ ‘దూకుడు’పై ఎన్నో అంచనాలున్నాయి. వాటన్నింటినీ నూరు శాతం ఈ చిత్రం రీచ్ అవుతుంది. ఊహించింది ఒకటైతే ఊహించని సర్‌ప్రైజ్‌లు ఎన్నో వుంటాయి.

మహేష్ అంటే నాకు ప్రాణం. తను పెద్ద స్టార్ అయినా నేను డైరెక్ట్ చేస్తున్నంత సేపు ఒక తమ్ముడ్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణం మ హేష్‌బాబే. ‘భయానికి మీనింగే తెలీని బ్లడ్‌రా నాది’ అనే డైలాగ్‌కి కృష్ణ గారి వ్యక్తిత్వమే స్ఫూర్తి’ అన్నారు.

'దూకుడు' గీతాలు

 ''భయానికి మీనింగంటే తెలియని బ్లడ్‌రా నాది " - అని దూకుడులో ఓ డైలాగ్‌ ఉంది. దీనికి స్ఫూర్తి కృష్ణ వ్యక్తిత్వమే. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామ''న్నారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'దూకుడు'. మహేష్‌బాబు, సమంత జంటగా నటించారు. ఈ చిత్రంలోని గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆవిష్కరించారు. సుకుమార్‌ స్వీకరించారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే వంద రోజుల వేడుకలా ఉంది. తమన్‌ చక్కటి బాణీలు అందించాడు. శ్రీను వైట్ల నాన్నగారికి పెద్ద అభిమాని. చిత్రీకరణ జరిగిన తొమ్మిది నెలలు ఓ విహార యాత్రలా గడిచింది. దూకుడు విడుదల నా అభిమానులకు పండగే'' అని చెప్పారు. ''ప్రేక్షకులు దూకుడు పై పెట్టుకున్న అంచనాలను కచ్చితంగా చేరుకుంటామ''న్నారు చిత్ర దర్శకుడు. సమంత మాట్లాడుతూ ''మహేష్‌బాబుకి పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నాకిదో ప్రత్యేకమైన చిత్రం'' అన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్‌ శంకర్‌, నమ్రత, బ్రహ్మానందం, తమన్‌, జి.ఆదిశేషగిరిరావు, భోగవల్లి ప్రసాద్‌, దిల్‌ రాజులతోపాటు చిత్ర నిర్మాతలు రామ్‌, గోపీ, అనిల్‌ పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.

'దూకుడు' ఆడియో విడుదల

ప్రిన్స్‌ మహేష్‌బాబు, సమంత జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దూకుడు'. ఈ చిత్రంలోని పాటలను శిల్పాకళావేదికగా జరిగిన ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, మహేష్‌బాబు, నమ్రత, హీరోయిన్‌ సమంత, దర్శకులు శ్రీనువైట్ల, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నిర్మాత అనిల్‌, సంగీత దర్శకుడు థమన్‌ తదితరులు పాల్గొన్నారు.

మహేష్‌బాబు, పూరీలబిజినెస్‌మేన్ మొదలైంది

అంతకు ముందున్న బాక్సాఫీస్ రికార్డులకు ‘దిమ్మతిరిగి మైండ్ బ్లాక్’ అయ్యేలా చేసిన సినిమా మహేష్-పూరి జగన్నాథ్‌ల ‘పోకిరి’. ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ ఆ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ రూపొందుతోన్న చిత్రమే ‘బిజినెస్ మేన్’. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య సోమవారం మొదలైంది. దేవుని పటాలపై ముహూర్తపు దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ -‘‘ఈ కథ విన్నప్పట్నుంచీ ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళుతుందా అని ఆతృతతో ఎదురుచూశాను. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌ని అంతగొప్పగా తీర్చిదిద్దారు పూరి. మళ్లీ ‘పోకిరి’ లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది.

మా కాంబినేషన్ అంటే.. ఎక్స్‌పెక్టేషన్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘బిజినెస్‌మేన్’ కోసం అభిమానులతో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్నాను. అంటే... ఈ కథపై నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నా డెరైక్షన్‌లో వచ్చిన సినిమాల్లోని హీరో పాత్రలతో పోలిస్తే... ఇందులోని హీరో క్యారెక్టరైజేషన్ బెస్ట్. అది రేపు తెరపై మీరే చూస్తారు. లవ్, యాక్షన్ ప్రధానంగా సాగే సినిమా. వెంకట్‌గారు లాంటి డైనమిక్ ప్రొడ్యూసర్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 1న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు.

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ -‘‘బిజినెస్‌మేన్’ స్టోరీలైన్ సూపర్బ్. మహేష్‌ని ప్రేక్షకులు, అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాంటి క్యారెక్టరైజేషన్‌తో ఇందులో మహేష్ కనిపిస్తారు. అత్యున్నత సాంకేతిక విలువలతో స్టైలిష్‌గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కాజల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కో-డెరైక్టర్: విజయ్‌రామ్‌ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి.

'ది బిజినెస్‌ మేన్‌' ప్రారంభం

హేష్‌బాబుని 'పోకిరి'గా మార్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌. హీరోయిజానికి కొత్త అర్థం చెప్పిన చిత్రమది. మహేష్‌-పూరి కలయికలోమరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే... 'ది బిజినెస్‌ మేన్‌'. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పతాకంపై వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభమైంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''జగన్‌ నాకు ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరి అంచనాలను అందుకొనేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉంద''న్నారు. ''పోకిరి తరవాత మళ్లీ మహేష్‌తో చేయడం ఆనందంగా ఉంది. నా సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రీకరణ బాగుంటుందని అందరూ చెబుతారు. నాకు నచ్చిన హీరో 'ది బిజినెస్‌ మేన్‌'లో కనిపిస్తాడ''ని చెప్పారు. ''మహేష్‌ని ఎలా చూడాలని అభిమానులు ఆశిస్తారో... అలానే తీర్చిదిద్దుతున్న చిత్రమిది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, కళ: చిన్నా, కూర్పు: ఎన్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: తమన్‌.

18న 'దూకుడు' పాటలు

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. 'దూకుడు' పాటల్ని ఆగస్టు 18న విడుదల చేస్తారు. ఈ విషయాన్ని మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో తెలిపారు. ''దూకుడు పాటలు బాగా వచ్చాయి. తమన్‌ మంచి సంగీతాన్ని అందించారు. 18న పాటలు విడుదల చేస్తాం. మీలాగే నేను కూడా ఆరోజు కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని రాసుకొన్నారు. ఇటీవల 'దూకుడు' ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. దేనికీ తలవంచని ఓ యువకుని కథ ఇది. అతని లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా అందుకొన్నాడు? అనే విషయాల్ని ఆసక్తిగా చూపిస్తున్నాం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

మహేష్‌తో పార్వతీ మెల్టన్ ఐటెమ్‌సాంగ్

పవన్‌కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘మహేష్ ఖలేజా’. ఈచివూతంలో మహేష్‌కు జోడీగా పార్వతీమెల్టన్ నటించాల్సింది... కానీ ఆ అవకాశాన్ని అనుష్క ఎగరేసుకుపోవడంతో ‘ఖలేజా’ చిత్రంలో నటించే ఛాన్స్ కోల్పోయిన పార్వతీమెల్టన్ మరోసారి రెట్టించిన ఉత్సాహంతో తెలుగులో తన సత్తాను చాటుకోవడానికి రెడీ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ మహేష్ ‘దూకుడు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతానికి చిందులేయబోతోంది. దర్శకుడు శ్రీనువైట్ల ప్రత్యేకంగా కోరడంతో ఆ పాటలో నటించడానికి పార్వతీ మెల్టన్ అంగీకరించిందట.‘ఖలేజా’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ఆమె మళ్ళీ మహేష్ నటిస్తున్న ‘దూకుడు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ఆయనతో చిందులేసే అవకాశం పొందడం విశేషం.

ఒక్కసారి ఫిక్స్ అయితే అంతే


‘అతడు’ ఓ అంతర్ముఖుడు... నిండు గాంభీర్యంగా కనిపించే నెమ్మదస్తుడు’ ఇది మహేష్‌పై చాలామంది అభిప్రాయం. కానీ ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే అంతే... బ్లయిండ్‌గా వెళ్లిపోయే మొండితనం, ఆయన సొంతం అని చాలా తక్కువ మందికి తెలుసు. ‘దూకుడు’గా సినిమాలు చేయాలని మహేష్ నిశ్చయించుకున్న తర్వాత రోజుకు 12 గంటల పాటు షూటింగ్ స్పాట్‌లోనే ఉంటున్నారాయన. ఈ నెల చివరిలో కానీ, వచ్చేనెల ప్రథమార్ధంలో కానీ ‘దూకుడు’ విడుదల కానుంది.

‘పోకిరి’గా బాక్సాఫీస్ వసూళ్లకు కొత్త అర్థం చెప్పిన మహేష్... రాబోతున్న ‘దూకుడు’తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో అని ఆయన అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను మరింత పెంచడానికి ఈ నెల 13న ‘దూకుడు’ పాటలు విడుదలవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ‘బిజినెస్‌మ్యాన్’ చిత్రంలో ఆయన నటించనున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత బోయపాటి శ్రీను, రాజమౌళి, క్రిష్... సినిమాలు ఆయన చేస్తారని ఫిలింనగర్ సమాచారం. సో... ఇది మహేష్ అభిమానులకే కాదు... తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఓ మంచి వార్త అని చెప్పొచ్చు. నేడు మహేష్‌బాబు పుట్టిన రోజు. నేటితో 37వ పడిలోకి అడుగుపెడుతున్నారాయన. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ‘సూపర్‌స్టార్’ అభిమానులకు ఈ రోజు నిజంగా ఓ పండుగే.

అడుగుజాడల్లో...


'మీ నాన్నగారిలా వేగంగా సినిమాలు తీయరెందుకు..?' - మహేష్‌బాబు ఎప్పుడు ఎదురైనా చాలామంది సంధించే ప్రశ్న ఇదే. అందుకు ఆయన చిరునవ్వే సమాధానం. ఏడాదికి పద్దెనిమిది సినిమాల్లో నటించిన ఘనత ఘట్టమనేని కృష్ణది. మహేష్‌ పదకొండు సంవత్సరాల్లో చేసిన సినిమాల సంఖ్య... 16. నాణ్యత కూడా కావాలనేది మహేష్‌ వాదన. అందులోనూ నిజం కనిపిస్తుంది. 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి'... ఇలాంటి సినిమాలకు రెండేళ్లు తీసుకొన్నా తప్పేం లేదనిపిస్తుంది. కథతోపాటు సాంకేతికాంశాల మీద కూడా శ్రద్ధ పెట్టే కథానాయకుడు మహేష్‌. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది..? అని అడిగితే మళ్లీ కృష్ణ కనిపిస్తారు. స్కోప్‌, కలర్‌, 70ఎమ్‌.ఎమ్‌... ఇలా తెలుగు సినిమా సాంకేతిక హంగులు అద్దుకొన్న ప్రతి దశలోనూ కృష్ణ అడుగులు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే.. మహేష్‌ కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు. ఇక దూకుడే!
'అతిథి', 'ఖలేజా' సినిమాలు మహేష్‌ అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. వాళ్లెప్పుడూ 'పోకిరి' అంచనాలతోనే థియేటర్లకు వస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొన్న మహేష్‌ మరోసారి పోకిరి ఫార్ములానే నమ్ముకొన్నారు. ఆ సినిమానే 'దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మహేష్‌తో సమంత జోడీ కట్టింది. 'ఖలేజా'తో పోలిస్తే 'దూకుడు'... వేగంగానే సిద్ధమైంది. చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ నెల 13న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్‌తో 'ది బిజినెస్‌మేన్‌' త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటించేందుకు మహేష్‌ ఒప్పుకొన్నారు. సుకుమార్‌ కూడా మహేష్‌ కోసం ఓ కథ సిద్ధం చేసుకొంటున్నారు. మంగళవారం మహేష్‌బాబు జన్మదినం. ఆడంబరాలకు దూరంగా పుట్టిన రోజు జరుపుకోవాలనుకొంటున్నారు మహేష్‌.

రామోజీ ఫిల్‌సిటీలో దూకుడు

రోజు ఖాళీగా కూర్చుని... పదేళ్ల తరవాత నా పరిస్థితి ఏమిటో..? అని గాల్లో మేడలు కట్టే మనస్తత్వం కాదతనిది. ఇప్పుడు చేసిన పని వందేళ్లు గడిచినా గర్వంగా చెప్పుకోవాలి అనుకొంటాడు. ప్రతి అడుగూ చరిత్రగా మారాలని భావిస్తాడు. సాహసమే సోపానంగా చేసుకొని ముందడుగు వేసిన ఆ యువకుడి లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా సాధించాడు? ఈ విషయాలు తెలియాలంటే 'దూకుడు' సినిమా చూడాల్సిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సమంత నాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో పాటల్ని విడుదల చేయబోతున్నారు. యాక్షన్‌, వినోదం, సంగీతం.... ఈమూడూ సమపాళ్లలో మేళవించిన సినిమా ఇది. కథ, కథనాలు ఎవరూ ఊహహంచని విధంగా ఉంటాయి. మహేష్‌బాబు పాత్ర చిత్రణ ప్రధాన ఆకర్షణ అని చిత్రబృందం చెబుతోంది. తమన్‌ సంగీతం అందించారు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates